విజయ్‌సేతుపతి సినిమా షురూ | Sakshi
Sakshi News home page

విజయ్‌సేతుపతి సినిమా షురూ

Published Sun, Mar 3 2019 10:27 AM

Vijay Sethupathi New Movie Opening - Sakshi

నటుడు విజయ్‌సేతుపతి కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం షూటింగ్‌  సోమవారం నుంచి ప్రారంభం కానుంది. ప్రఖ్యాత చిత్ర నిర్మాణ సంస్థ విజయా ప్రొడక్షన్స్‌ నిర్మిస్తున్న ఈ చిత్రానికి ‘స్కెచ్‌’ చిత్రం ఫేమ్‌ విజయ్‌చందర్‌ దర్శకత్వం వహిస్తున్నారు. విజయ్‌సేతుపతికి జంటగా హీరోయిన్లు రాశీఖన్నా, నివేదాపేతురాజ్‌ నటించనున్నారు.

హాస్య నటుడు సూరి, నాజర్, అసుతోష్‌ రాణా, రవి కిశాన్, మొట్టైరాజేంద్రన్, మారిముత్తు, జాన్‌ విజయ్, శ్రీమాన్‌ ముఖ్యపాత్రలను పోషించనున్నారు. చిత్రానికి సంగీత ద్వయం వివేక్‌ మెర్విన్‌ సంగీతబాణీలు కడుతున్నారు. ఈనెల 4న హైదరాబాద్‌లో పూజా కార్యక్రమాలతో మొదటి షెడ్యూల్‌ షూటింగ్‌ ప్రారంభం కానున్నట్లు చిత్ర వర్గాలు తెలిపాయి. 

Advertisement
Advertisement