25 కిలోలు కట్‌! | Vijay Sethupathi To Lose 25 KGs For Aamir Khan Film | Sakshi
Sakshi News home page

25 కిలోలు కట్‌!

Mar 6 2020 3:02 AM | Updated on Mar 6 2020 3:02 AM

Vijay Sethupathi To Lose 25 KGs For Aamir Khan Film - Sakshi

విజయ్‌ సేతుపతి

విలక్షణమైన సినిమాలు, పాత్రలు, నటనతో అన్ని ఇండస్ట్రీల దృష్టిని ఆకర్షిస్తున్న తమిళ నటుడు విజయ్‌ సేతుపతి. తన ప్రతీ సినిమాతోనూ ప్రేక్షకులను ఏదో విధంగా ఆశ్చర్యపరుస్తున్నారాయన. ప్రస్తుతం అల్లు అర్జున్‌–సుకుమార్‌ సినిమా, వైష్ణవ్‌ తేజ్‌ ‘ఉప్పెన’, తమిళ సూపర్‌స్టార్‌ విజయ్‌ సినిమాల్లో కీలక పాత్రలు చేస్తున్నారాయన. అలాగే హిందీ వైపు కూడా వెళుతున్నారు. ఆమిర్‌ఖాన్‌ టైటిల్‌ రోల్‌ చేస్తున్న ‘లాల్‌సింగ్‌ చద్దా’లో విజయ్‌ సేతుపతి ఓ ప్రత్యేక పాత్ర చేస్తున్నారు. ఈ పాత్ర కోసం సుమారు 25కిలోలు తగ్గనున్నారని టాక్‌. ఈ సినిమాలో సేతుపతి, ఆమిర్‌ మిలటరీ జవానులుగా కనిపిస్తారట. ఈ పాత్రలో ఫిట్‌గా కనిపించడానికే ఈ బరువు తగ్గడం. ఆల్రెడీ అమిర్‌ 20 కిలోలు తగ్గిన సంగతి తెలిసిందే.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement