అందుకే ‘పుష్ప’ నుంచి తప్పుకున్నా : విజయ్‌

Vijay Sethupathi Confirms Out From Allu Arjun Pushpa - Sakshi

స్టైలిష్‌ స్టార్‌ అల్లు అర్జున్‌, ప్రముఖ దర్శకుడు సుకుమార్‌ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న తాజా చిత్రం పుష్ప. ఈ చిత్రంలో తమిళ హీరో విజయ్‌ సేతుపతి ఓ కీలక పాత్ర పోషించాల్సి ఉండింది. అయితే సినిమా షూటింగ్‌ ప్రారంభానికి ముందే ఆయన ఆ చిత్రం నుంచి తప్పుకున్నట్టుగా వార్తలు వెలువడ్డాయి. కొత్తగా కన్నడ నటుడు ధనుంజయ ఈ మూవీలోకి తీసుకోవడంతో ఆ వార్తలు నిజమేనని అంతా భావించారు. అయితే విజయ్‌ ఈ చిత్రం నుంచి తప్పుకోవడానికి సంబంధించి సోషల్‌ మీడియాలో అనేక  రకాల కథనాలు ప్రచారంలోకి వచ్చాయి. తాజాగా అందుకు సంబంధించి విజయ్‌ స్పష్టతనిచ్చారు. 

ఓ ప్రముఖ ఆంగ్ల మీడియాతో మాట్లాడుతూ.. తను పుష్ప చిత్రం నుంచి తప్పుకున్నది వాస్తమేనని తెలిపారు. డేట్స్‌ కుదరకపోవడం వల్లే తను ఈ ప్రాజెక్టు నుంచి వైదొలిగినట్టు వెల్లడించారు. ఈ విషయాన్ని డైరెక్టర్‌ సుకుమార్‌కు కలిసి వివరించానని అన్నారు. సినిమా చేయాలని ఉన్నప్పటికీ.. తన డేట్స్‌ వల్ల షూటింగ్‌కు ఇబ్బంది కలగకుండా ఉండేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్టు స్పష్టం చేశారు. (బన్నీని ఒక్క ఛాన్స్‌ అడిగిన బాలీవుడ్‌ డైరెక్టర్‌)

ఇప్పటికే విడుదలైన పుష్ప ఫస్ట్‌ లుక్‌ విశేష స్పందన వచ్చిన సంగతి తెలిసిందే. ఈ చిత్రాన్ని తెలుగుతోపాటుగా తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో విడుదల చేయనున్నారు. మరోవైపు గతంలోనే ఈ చిత్ర షూటింగ్‌ ప్రారంభం కావాల్సి ఉన్నప్పటికీ.. కరోనా లాక్‌డౌన్‌తో వాయిదా పడింది. ఆ తర్వాత ఇప్పటివరకు షూటింగ్‌ ప్రారంభం గురించి చిత్ర బృందం నుంచి ఎలాంటి ప్రకటన వెలువడలేదు. 

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top