లవ్‌ అండ్‌ మ్యూజిక్‌ | Vijay Sethupathi Amala Paul Movie launched in Palani | Sakshi
Sakshi News home page

లవ్‌ అండ్‌ మ్యూజిక్‌

Jun 15 2019 12:22 AM | Updated on Jun 15 2019 12:22 AM

Vijay Sethupathi Amala Paul Movie launched in Palani - Sakshi

విజయ్‌ సేతుపతి

అరడజనుకు పైగా సినిమాలతో బిజీగా ఉన్నప్పటికీ మరో కొత్త సినిమాకు కొబ్బరికాయ కొట్టి షూటింగ్‌ షురూ చేశారు తమిళ నటుడు విజయ్‌ సేతుపతి. కోలీవుడ్‌లో వెంకటకృష్ణ అనే కొత్త దర్శకుడు తెరకెక్కించనున్న సినిమాలో విజయ్‌ సేతుపతి హీరోగా నటిస్తున్నారు. ఈ సినిమాలో హీరోయిన్‌గా అమలా పాల్‌ నటి స్తున్నారు. ఈ చిత్రం షూటింగ్‌ శుక్రవారం ప్రారంభమైంది. సంగీతం, ప్రేమ ప్రధానాంశాలుగా రూపొందుతున్న ఈ సినిమాలో విజయ్‌ సేతుపతి మ్యుజిషియన్‌గా నటిస్తున్నారని తెలిసింది. చెన్నై షెడ్యూల్‌ పూర్తయిన తర్వాత ఊటీలో ఈ సినిమా నెక్ట్స్‌ షెడ్యూల్‌ జరగనుంది. అమలాపాల్‌తో పాటు ఓ విదేశీ నటి ఈ సినిమాలో మరో హీరోయిన్‌గా కనిపించనున్నారని టాక్‌. ‘సంగతమిళన్, లాభం’ ఇలా తమిళ ప్రాజెక్ట్స్‌తో బిజీగా ఉన్న విజయ్‌ సేతుపతి తెలుగులో ‘సైరా: నరసింహారెడ్డి’, ‘ఉప్పెన’ సినిమాల్లో కీలకపాత్రలు చేస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement