బంగారు నాణేలు కానుకగా ఇచ్చిన స్టార్ హీరో | Vijay gifts gold coins to Mersal team | Sakshi
Sakshi News home page

బంగారు నాణేలు కానుకగా ఇచ్చిన స్టార్ హీరో

Aug 2 2017 3:33 PM | Updated on Sep 17 2017 5:05 PM

బంగారు నాణేలు కానుకగా ఇచ్చిన స్టార్ హీరో

బంగారు నాణేలు కానుకగా ఇచ్చిన స్టార్ హీరో

కోలీవుడ్ స్టార్ విజయ్ హీరోగా తెరకెక్కుతున్న తాజా చిత్రం మెర్సల్. ఇప్పటికే భారీ హైప్ క్రియేట్ చేస్తున్న

కోలీవుడ్ స్టార్ విజయ్ హీరోగా తెరకెక్కుతున్న తాజా చిత్రం మెర్సల్. ఇప్పటికే భారీ హైప్ క్రియేట్ చేస్తున్న ఈ సినిమా మరోసారి వార్తల్లో నిలిచింది. తన సినిమాకోసం పనిచేసిన యూనిట్ సభ్యులకు ఏదో ఒక కానుక ఇవ్వటం హీరో విజయ్ కి అలవాటు. అయితే ఈ సారి విజయ్ ఇచ్చిన కానుక కోలీవుడ్ లో టాక్ ఆఫ్ ద ఇండస్ట్రీగా మారింది.

తన  మెర్సల్ మూవీకి పనిచేసిన దాదాపు 200 మంది సాంకేతిక నిపుణులు, సహాయ సాంకేతిక నిపుణులకు ఇళయదళపతి విజయ్ బంగారు నాణేలను కానుకగా ఇచ్చాడు. అట్లీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో విజయ్ సరసన కాజల్, సమంత, నిత్యామీనన్ హీరోయిన్లుగా నటిస్తుండగా. ఏ ఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నాడు.

Advertisement
 
Advertisement
Advertisement