అర్జున్‌ రెడ్డికి అద్భుతమైన అవకాశం | vijay devarakonda team up with mani ratnam | Sakshi
Sakshi News home page

అర్జున్‌ రెడ్డికి అద్భుతమైన అవకాశం

Oct 31 2017 1:38 PM | Updated on Oct 31 2017 1:38 PM

vijay devarakonda team up with mani ratnam

పెళ్లి చూపులు సినిమాతో తొలి సక్సెస్‌ అందుకున్న విజయ్‌ దేవరకొండ, అర్జున్‌ రెడ్డి సినిమాతో హాట్‌ టాపిక్‌ గా మారిపోయాడు. ఈ సినిమా సక్సెస్‌ తరువాత అంతా విజయ్‌ని అర్జున్‌ రెడ్డిఅనే పిలుస్తున్నారు. విజయ్‌ ఇంతటి భారీ క్రేజ్‌ సాధించి పెట్టిన అర్జున్‌ రెడ్డి సినిమా ఇప్పుడు మరో గోల్డ్‌ ఛాన్స్‌ కూడా అందించిందన్న ప్రచారం జరుగుతోంది. సౌత్‌ ఇండస్ట్రీలో మాత్రమేకాదు ఇండియన్‌ సినిమాలోనే మణిరత్నం సినిమాలో నటించటం​ ప్రతీ నటుడి కల. అయితే అలాంటి కల త్వరలోనే విజయ​ దేవరకొండ విషయంలో నిజం కాబోతోందట.

ఇటీవల అర్జున్‌ రెడ్డి సినిమాను చూసిన లెజెండరీ దర్శకుడు మణిరత్నం, విజయ్‌ నటనపై ప్రశంసలు కురిపించినట్టుగా తమిళ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. అంతేకాదు విజయ్‌ దేవరకొండ హీరో మణిరత్నం ఓ సినిమా రూపొందించాలన్న ఆలోచనలో ఉన్నట్టుగా వార్తలు వినిపిస‍్తున్నాయి. విజయ్‌ దేవరకొండ ప్రస్తుతం పరుశురాం దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు. అంతేకాదు మరో అరడజను చిత్రాలు విజయ్‌ చేతిలో ఉన్నాయి. మణి రత్నం శింబు, విజయ్‌ సేతుపతి, అరవింద్‌ స్వామి, ఫాజిల్‌ ల కాంబినేషన్‌ లో ఓ సినిమా తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా పూర్తయ్యే లోపు విజయ్‌తో మణి చేయాలనుకుంటున్న సినిమాపై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement