‘టాక్సీవాలా’ రికార్డ్‌ : తొలి రోజే బ్రేక్‌ ఈవెన్‌ | Vijay Devarakonda Taxiwaal FirstDay Collections | Sakshi
Sakshi News home page

Nov 18 2018 12:29 PM | Updated on Nov 18 2018 12:31 PM

Vijay Devarakonda Taxiwaal FirstDay Collections - Sakshi

విజయ్‌ దేవరకొండ హీరోగా తెరకెక్కిన తాజా చిత్రం టాక్సీవాలా. రిలీజ్ కు ముందే ఈ సినిమా లీక్‌ అవ్వటంతో చిత్రయూనిట్‌తో పాటు అభిమానులు కూడా సినిమా కలెక్షన్లు ఎలా ఉంటాయో అన్న ఆందోళన వ్యక్తం చేశారు. అయితే అందరిని అంచనాలను తలకిందులు చేస్తూ మరోసారి సెన్సేషనల్‌ స్టార్‌గా ప్రూవ్ చేసుకున్నాడు విజయ్‌ దేవరకొండ. (‘టాక్సీవాలా’ మూవీ రివ్యూ)

మరోసారి బాక్సాఫీస్‌ వద్ద సత్తా చాటిన విజయ్‌ ఏకంగా తొలి రోజే 10.5 కోట్ల గ్రాస్‌ సాధించి తొలి రోజే బ్రేక్ ఈవెన్‌ సాధించిన హీరోగా రికార్డ్ సృష్టించాడు. ఈ విషయాన్ని నిర్మాత ఎస్‌కేయన్‌ స్వయంగా వెల్లడించారు. తనకు అండగా నిలిచిన విజయ్‌ దేవరకొండ, గీతా ఆర్ట్స్‌, యూవీ క్రియేషన్స్‌ బ్యానర్‌లతో పాటు తెలుగు సినీ పరిశ్రమ, మీడియా, ప్రేక్షకులకు కృతజ్ఞతలు తెలియజేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement