'14 గంటలు ఫ్లైట్లో ఉంటే పెళ్లి చేసేశారు' | Vijay Devarakonda reaction to marriage gossips | Sakshi
Sakshi News home page

'14 గంటలు ఫ్లైట్లో ఉంటే పెళ్లి చేసేశారు'

Jun 5 2017 11:48 AM | Updated on Sep 5 2017 12:53 PM

'14 గంటలు ఫ్లైట్లో ఉంటే పెళ్లి చేసేశారు'

'14 గంటలు ఫ్లైట్లో ఉంటే పెళ్లి చేసేశారు'

ఇటీవల తన పెళ్లి గురించి మీడియాలో వస్తున్న వార్తలపై హీరో విజయ్ దేవరకొండ స్పందించాడు. కొంత కాలంగా విమ్మీ

ఇటీవల తన పెళ్లి గురించి మీడియాలో వస్తున్న వార్తలపై హీరో విజయ్ దేవరకొండ స్పందించాడు. కొంత కాలంగా విమ్మీ అనే అమ్మాయితో ప్రేమలో ఉన్న విజయ్ దేవరకొండ త్వరలోనే తనని పెళ్లి చేసుకోబోతున్నాడన్న వార్త సోషల్ మీడియాలో హల్ చల్ చేసింది. అయితే ఈ విషయంపై కాస్త ఆలస్యంగా స్పందించిన విజయ్ '14 గంటలు ఫ్లైట్ లో ఉంటే ఇండియాలో నా పెళ్లి చేసేశారంట. నా భార్య విమ్మీ పేరుతో పాటు నా ఇద్దరు పిల్లలు రమ్మీ, డమ్మీల పేర్లు ప్రస్థావించటం మీడియా మరిచిపోయింది. నాకు శుభాకాంక్షలు తెలిపిన వారందరికీ థ్యాంక్స్. ఫన్నీ గాసిప్' అంటూ కామెంట్ చేశాడు.

పెళ్లి చూపులు సినిమాలతో సూపర్ హిట్ కొట్టిన విజయ్ దేవరకొండ తరువాత ద్వారక సినిమాతోనూ పరవాలేదనిపించాడు. ప్రస్తుతం అర్జున్ రెడ్డి షూటింగ్ లో బిజీగా ఉన్న ఈ యంగ్ హీరో తరువాత గీతా ఆర్ట్స్ బ్యానర్ లో పరుశురామ్ దర్శకత్వంలో సినిమా ప్రారంభించనున్నాడు. వీటితో పాటు రాహుల్ సంక్రిత్యాన్ దర్వకత్వంలో సూపర్ నాచురల్ థ్రిల్లర్ తో పాటు, నందినీ రెడ్డి దర్వకత్వంలో రొమాంటిక్ ఎంటర్టైనర్ చేసేందుకు అంగీకరించాడు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement