కుర్ర హీరోతో సమంత జోడి..? | Vijay Devarakonda opposite Samantha | Sakshi
Sakshi News home page

కుర్ర హీరోతో సమంత జోడి..?

May 12 2017 3:48 PM | Updated on Sep 5 2017 11:00 AM

కుర్ర హీరోతో సమంత జోడి..?

కుర్ర హీరోతో సమంత జోడి..?

నాగచైతన్యతో పెళ్లి వార్తల తరువాత కొంత కాలం సినిమాలకు బ్రేక్ ఇచ్చిన సమంత, తిరిగి సినిమాలతో బిజీ అవుతోంది. ఇప్పటికే

నాగచైతన్యతో పెళ్లి వార్తల తరువాత కొంత కాలం సినిమాలకు బ్రేక్ ఇచ్చిన సమంత, తిరిగి సినిమాలతో బిజీ అవుతోంది. ఇప్పటికే రాజుగారి గది 2, రామ్ చరణ్, సుకుమార్ల సినిమాలతో బిజీగా ఉన్న సమంత, త్వరలో మహానటి సినిమాలో నటించేందుకు రెడీ అవుతోంది. అయితే ఈ సినిమాలో సమంతకు జోడిగా ఓ యంగ్ హీరో నటించనున్నాడట. ఎవడే సుబ్రమణ్యం సినిమాతో దర్శకుడిగా పరిచయం అయిన నాగ అశ్విన్ మహానటి సినిమాను తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే.

ఎవడే సుబ్రమణ్యం సినిమాతో నటుడిగా గుర్తింపు తెచ్చుకున్న విజయ్ దేవరకొండను తన నెక్ట్స్ సినిమాలోనూ కంటిన్యూ చేస్తున్నాడు దర్శకుడు నాగ అశ్విన్. మహానటి సినిమాలో కథను నడిపించే సమంత పాత్రకు జోడిగా విజయ్ను సెలెక్ట్ చేశారన్న ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతానికి అఫీషియల్ ఎనౌన్స్మెంట్ లేకపోయినా.. మహానటిలో విజయ్ దేవరకొండ నటిస్తున్నాడన్న టాక్ బలంగా వినిపిస్తోంది. సావిత్రి జీవిత కథ ఆధారంగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో సావిత్రి పాత్రలో కీర్తి సురేష్ నటిస్తోంది. అనుష్క, దుల్కర్ సల్మాన్ లు ఇతర కీలక పాత్రలో అలరించనున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement