కొత్త దర్శకుడితో విజయ్‌..! | Sakshi
Sakshi News home page

కొత్త దర్శకుడితో విజయ్‌..!

Published Thu, Nov 9 2017 3:26 PM

Vijay Devarakonda Next movie with Bharat Kamma - Sakshi

అర్జున్‌ రెడ్డి సినిమక్తో ఒక​సారిగా స్టార్‌గా మారిపోయిన విజయ్‌ దేవరకొండ, వరుస సినిమాలకు కమిట్‌ అవుతున్నాడు. ఇప్పటికే అరడజనుకు పైగా సినిమాలతో బిజీగా ఉన్న ఈ యంగ్‌ హీరో తాజాగా మరో సినిమాకు ఓకె చెప్పాడు. విజయ్‌ ప్రస్తుతం గీతా ఆర్ట్స్‌ 2 బ్యానర్‌ లో తెరకెక్కుతున్న సినిమాలో నటిస్తున్నాడు. వీటితో పాటు మరికొన్ని సినిమాలు లైన్‌లో ఉన్నాయి. వీటిలో ఎక్కువగా ఇప్పటికే దర్శకులుగా సక్సెస్‌ సాధించిన వారితోనే సినిమాలు చేస్తున్నాడు.

మరోసారి ఓ కొత్త దర్శకుడికి ఛాన్స్‌ ఇస్తున్నాడు విజయ్‌ దేవరకొండ.భరత్‌ కమ్మ అనే కొత్త దర్శకుడు చెప్పిన కథ నచ్చటంతో అతనితో సినిమా చేసేందుకు ఓకె చెప్పాడు. ఈ సినిమాను విజయ్‌ హీరోగా పెళ్లిచూపులు సినిమాను నిర్మించిన బిగ్‌ బెన్‌ సినిమాస్‌ బ్యానర్‌తో కలిసి బడా నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్‌ నిర్మించనుంది. ప్రస్తుతం చర్చల దశలో ఉన్న ఈ ప్రాజెక్ట్‌పై త్వరలోనే అధికారిక ప్రకటన వచ్చే అవకావం ఉంది.

Advertisement
Advertisement