‘వరల్డ్‌ ఫేమస్‌ లవర్‌’గా విజయ్‌ దేవరకొండ

Vijay Devarakonda, Kranthi Madhav Movie Title Revealed - Sakshi

డియర్‌ కామ్రేడ్‌ సినిమాతో నిరాశపరిచిన సెన్సేషనల్‌ స్టార్ విజయ్‌ దేవరకొండ ప్రస్తుతం రెండు సినిమాలతో బిజీగా ఉన్నాడు. క్రాంతి మాధవ్‌ దర్శకత్వంలో ఓ సినిమాతో పాటు తమిళ దర్శకుడు ఆనంద్‌ అన్నామలై దర్శకత్వంలో హీరో సినిమాల్లో నటిస్తున్నాడు. రొమాంటిక్‌ డ్రామాగా తెరకెక్కుతున్న క్రాంతి మాధవ్‌ సినిమాకు చాలా కాలంగా షూటింగ్ జరుపుకుంటోంది.

తాజాగా ఈ సినిమాను ప్రమోషన్‌ కార్యక్రమాలు ప్రారంభించారు చిత్రయూనిట్‌. డిఫరెంట్ కాన్సెప్ట్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమాకు ‘వరల్డ్‌ ఫేమస్‌ లవర్‌’ అనే టైటిల్‌ను ఫిక్స్‌ చేశారు. క్రియేటివ్‌ కమర్షియల్స్ బ్యానర్‌పై వల్లభ నిర్మిస్తున్న ఈ సినిమాలో రాశీఖన్నా, ఐశ్వర్యా రాజేష్‌, కేథరిన్‌ థ్రెస్సా, ఇసాబెల్లెలు హీరోయిన్లుగా నటిస్తున్నారు. గోపి సుందర్‌ సంగీతమందిస్తున్నాడు. ప్రస్తుతం హైదరాబాద్‌లో చిత్రీకరణ జరుపుకుంటున్న ఈ సినిమా ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌ను సెప్టెంబర్‌ 20న రిలీజ్ చేయనున్నారు.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top