ఇక్కడ చాలా హాట్ గురూ! | Vijay and Shruti Haasan in Krabi Beach for Puli Song Shoot | Sakshi
Sakshi News home page

ఇక్కడ చాలా హాట్ గురూ!

May 12 2015 11:38 PM | Updated on Sep 3 2017 1:54 AM

ఇక్కడ చాలా హాట్ గురూ!

ఇక్కడ చాలా హాట్ గురూ!

వేసవికాలంలో ఏదైనా చల్లని ప్రాంతానికి వెళితే చాలా హాయిగా ఉంటుంది. అందుకు భిన్నంగా హాట్ హాట్‌గా

వేసవికాలంలో ఏదైనా చల్లని ప్రాంతానికి వెళితే చాలా హాయిగా ఉంటుంది. అందుకు భిన్నంగా హాట్ హాట్‌గా ఉండే ప్రదేశాలకు వెళితే, పెనంమీద నుంచి పొయ్యిలో పడ్డట్లే. ప్రస్తుతం శ్రుతీహాసన్ పరిస్థితి అదే. హాట్‌గా ఉన్న హైదరాబాద్, చెన్నై నుంచి ఆమె క్రాబీ వెళ్లారు. ఈ ఊరి పేరు ఎక్కడా విన్నట్లు లేదే అనుకుంటున్నారు? ఇది మన దేశానికి చెందిన ఊరు కాదు. థాయ్‌ల్యాండ్‌లో ఉంది. తమిళ చిత్రం ‘పులి’ షూటింగ్ కోసం శ్రుతీహాసన్ అక్కడికెళ్లారు. ఇక్కడ చాలా హాట్‌గా ఉందని ట్విట్టర్లో పెట్టారామె. ఎంత వేడిగా ఉన్నా ఏమీ అనిపించడంలేదనీ, ఎందుకంటే లొకేషన్ చాలా అందంగా ఉందనీ ఆమె పేర్కొన్నారు. ప్రకృతి సౌందర్యాన్ని దేనితోనూ వెలకట్టలేమని ఈ సందర్భంగా శ్రుతీహాసన్ అన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement