హీరోయిన్కు గౌరవ డాక్టరేట్ | Vidya Balan to get honorary doctorate | Sakshi
Sakshi News home page

హీరోయిన్కు గౌరవ డాక్టరేట్

Jun 1 2015 6:37 PM | Updated on Apr 3 2019 6:23 PM

హీరోయిన్కు గౌరవ డాక్టరేట్ - Sakshi

హీరోయిన్కు గౌరవ డాక్టరేట్

బాలీవుడ్ హీరోయిన్ విద్యాబాలన్కు అహ్మదాబాద్లోని రాయ్ యూనివర్సిటీ గౌరవ డాక్టరేట్ ప్రదానం చేయనుంది.

బాలీవుడ్ హీరోయిన్ విద్యాబాలన్కు అహ్మదాబాద్లోని రాయ్ యూనివర్సిటీ గౌరవ డాక్టరేట్ ప్రదానం చేయనుంది. భారతీయ సినిమా రంగానికి ఆమె చేసిన సేవలు, వెండితెర మీద మహిళ బలాన్ని చూపించే ప్రయత్నాలు చేయడం లాంటి కారణాలతో ఆమెకు ఈ డాక్టరేట్ ఇస్తున్నారు. దీనిపై విద్యాబాలన్ సంతోషం వ్యక్తం చేసింది.

''ఇంత గౌరవం దక్కడం నిజంగా చాలా అద్భుతం. సినీ పరిశ్రమలో పదేళ్లు పూర్తి చేసుకున్న ఈ సంవత్సరంలోనే డాక్టరేట్ కూడా రావడం మరింత ప్రత్యేకం" అని విద్యాబాలన్ తెలిపింది. ఏ నటికైనా వాళ్లు చేసిన కృషికి ఇంతకంటే పెద్ద ప్రశంస మరొకటి ఉండదని కూడా చెప్పింది. పరిణీత సినిమాతో బాలీవుడ్ రంగప్రవేశం చేసిన విద్యాబాలన్.. 'డర్టీ పిక్చర్' లాంటి సినిమాల్లో కూడా ధైర్యంగా నటించి విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ఇక సినిమాల విషయానికి వస్తే, మోహిత్ సూరి దర్శకత్వం వహిస్తున్న 'హమారీ అధూరీ కహానీ' సినిమాలో విద్యాబాలన్ నటిస్తోంది. ఇందులో ఇమ్రాన్ హష్మి, రాజ్కుమార్ రావు తదితరులు ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement