నిజమైన బహుమతి

Vicky Kaushal starrer Uri completes 50 days at the box office - Sakshi

కళాకారులకు అభినందనలు, పురస్కారాలే నిజమైన బహుమతులు. అలాంటి బహుమతి లభించినందుకు తెగ ఆనందపడిపోతున్నారు నటి యామీ గౌతమ్‌. ఆదిత్యా థార్‌ దర్శకునిగా పరిచయం అయిన ‘ఉరి: ది సర్జికల్‌ స్ట్రైక్స్‌’ సినిమాలో పల్లవి శర్మ అలియాస్‌ జాస్మిన్‌ అనే ఓ ప్రధాన పాత్ర చేశారు యామీ గౌతమ్‌. విక్కీ కౌశల్‌ హీరోగా నటించారు. 2016లో జరగిన ఉరి దాడి ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించారు. జనవరి 11న విడుదలైన ఈ చిత్రం దాదాపు 300కోట్ల వసూళ్లను రాబట్టి బాక్సాఫీస్‌ వద్ద బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. బెంగళూరులో జరిగిన ఓ యూత్‌ సమ్మిట్లో పాల్గొన్న యామి ఈ చిత్రం గురించి ప్రత్యేకంగా మాట్లాడారు.

‘‘సైనికుల నేపథ్యంలో రూపొందిన ఈ  సినిమా సక్సెస్‌ అవ్వడం ఆనందంగా ఉంది. ఓ టీనేజ్‌ అమ్మాయి నా దగ్గరకు వచ్చి ‘సినిమాలో రా (రీసెర్చ్‌ అండ్‌ అనాలిసిస్‌ వింగ్‌) ఏజెంట్‌గా బాగా నటించారు. మన ఆర్మీ బలగాలపై నాకు మరింత గౌరవం పెరిగింది. భవిష్యత్‌లో ఇంటెలిజెన్స్‌ ఆఫీసర్‌ అయి, దేశానికి సేవ చేస్తాను’  అంది. అప్పుడు నేను చాలా గర్వంగా ఫీల్‌ అయ్యా. సినిమాలో నేను చేసిన పాత్ర ఆ అమ్మాయికి స్ఫూర్తిగా నిలవడం చాలా ఆనందంగా అనిపించింది. ఆ అమ్మాయి మాటలే నాకు దక్కిన  నిజమైన బహుమతిగా భావిస్తున్నాను’’ అని అన్నారు.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top