రిజల్ట్ ఎలా ఉన్నా, పట్టించుకోను : వెన్నెల కిషోర్‌ | Vennela Kishore sankranthi wishes to every one | Sakshi
Sakshi News home page

రిజల్ట్ ఎలా ఉన్నా, పట్టించుకోను : వెన్నెల కిషోర్‌

Jan 15 2018 9:52 AM | Updated on Jul 6 2018 3:32 PM

Vennela Kishore sankranthi  wishes to every one - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : నటుడు వెన్నెల కిశోర్‌ తెలుగు ప్రజలందరికీ సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు తెలిపారు. నటుడు రమేష్‌ తో కలిసి ఆదివారం పతంగిలు ఎగురవేసిన కిశోర్‌, సోమవారం ఉదయమే ఇంటిపైన ఖాళీ స్థలంలో కుర్రాలతో కలిసి క్రికెట్‌ ఆడి సంక్రాంతి పండగను తెగ ఎంజాయ్‌ చేశాడు.


సంక్రాంతి రోజు ఫుల్‌ పండగ మూడ్‌లో ఉన్నట్టు తెలిపాడు. క్రికెట్‌ మ్యాచ్‌ సందర్భంగా టాస్‌ వేయగా, వెన్నెల కిశోర్‌ ఓడి పోయాడు. టాస్‌ ఓడినా బ్యాటింగే కావాలి అంటూ మరో యువకుడిని బౌలింగ్‌ తీసుకో అంటూ సరదాగా అతడితో సంభాషించాడు. టాస్‌ రిజల్ట్‌ ఎలా ఉన్నా.. పెద్దగా పట్టించుకోను అంటూ ఫేస్‌ బుక్‌లో ఓ వీడియో పోస్ట్‌ పెట్టాడు. టాస్‌ ఓడిన వెన్నెల కిశోర్‌కు బెటర్‌ లక్‌ నెక్ట్స్‌ టైం అంటూ కొందరు కామెంట్లు పెడుతుంటే, మరికొందరు మాత్రం చిన్న పిల్లల దగ్గర బ్యాటింగ్‌ కోసం ఛీటింగ్‌ ఏంటి భయ్యా అంటూ సరదాగా కామెంట్లు పెడుతున్నారు.
 

Advertisement
 
Advertisement
Advertisement