పుల్‌ కామెడీ ఎంటర్‌టైనర్‌గా ఎంఆర్‌పీ.. టీజర్‌ చూశారా? | Tollywood Movie MRP Teaser Out Now | Sakshi
Sakshi News home page

MRP Teaser: పుల్‌ కామెడీ ఎంటర్‌టైనర్‌గా ఎంఆర్‌పీ.. టీజర్‌ చూశారా?

Apr 22 2026 2:21 PM | Updated on Apr 22 2026 2:36 PM

Tollywood Movie MRP Teaser Out Now

నరేశ్‌ అగస్త్య, వెన్నెల కిశోర్, సుదర్శన్ ప్రధాన పాత్రల్లో వస్తోన్న తాజా చిత్రం ఎంఆర్‌పీ. నీకెంత, నాకెంత అనేది సబ్ టైటిల్. ఈ సినిమాకు శ్రవణ్ జేస్టా దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో బాలీవుడ్ భామ డోనాల్ బిస్తీ హీరోయిన్‌గా నటిస్తున్నారు. తాజాగా ఈ మూవీ టీజర్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. 

'మన కల కోసం మనం పనిచేయకపోతే.. వేరే వాళ్ల కలల కోసం మనం పనిచేయాల్సి ఉంటుంది' అనే డైలాగుతో ప్రారభమైన టీజర్‌ సినీ ప్రియులను ‍అలరిస్తోంది. ఈ టీజర్ చూస్తుంటే ఫుల్ కామెడీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కించినట్లు తెలుస్తోంది. కాగా.. ఈ సినిమాకు అజయ్ అరసాడ సంగీతమందిస్తున్నారు. 

Advertisement
 
Advertisement
Advertisement