డిసెంబరులో సందడి? | venky mama release on december 13 | Sakshi
Sakshi News home page

డిసెంబరులో సందడి?

Nov 17 2019 2:36 AM | Updated on Nov 17 2019 2:36 AM

venky mama release on december 13 - Sakshi

వెంకటేశ్

వెంకటేశ్, నాగచైతన్య హీరోలుగా కేఎస్‌ రవీంద్ర దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం ‘వెంకీమామ’. ఈ చిత్రంలో పాయల్‌ రాజ్‌పుత్, రాశీఖన్నా కథానాయికలుగా నటించారు. డి. సురేష్‌బాబు, టీజీ విశ్వప్రసాద్‌ నిర్మిస్తున్నారు. వివేక్‌ కూచిభొట్ల సహ–నిర్మాత. ఈ చిత్రాన్ని డిసెంబరు 13న విడుదల చేయాలనుకుంటున్నారని తాజా సమాచారం. రియల్‌లైఫ్‌లో మేనమామ, మేనల్లుడు అయిన వెంకటేశ్, నాగచైతన్య రీల్‌ లైఫ్‌లో మామ, అల్లుడిగా డిసెంబరులో వెండితెరపై సందడి చేయబోతున్నారన్నమాట. రిలీజ్‌ డేట్‌పై అతి త్వరలో అధికారిక ప్రకటన వెల్లడయ్యే అవకాశం ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement