బర్త్‌డేకి మామాఅల్లుళ్లు | venky mama release date fixed | Sakshi
Sakshi News home page

బర్త్‌డేకి మామాఅల్లుళ్లు

Dec 3 2019 12:11 AM | Updated on Dec 3 2019 8:14 AM

venky mama release date fixed - Sakshi

వెంకటేశ్, నాగచైతన్య

వెంకటేశ్, నాగచైతన్యల మల్టీస్టారర్‌ మూవీ ‘వెంకీ మామ’ విడుదల తేదీపై ఓ స్పష్టత వచ్చేసింది. మామా అల్లుళ్లను స్కీన్ర్‌ మీద ఎప్పుడెప్పుడు చూడాలా? అని ఎదురు చూస్తున్న ఫ్యాన్స్‌కి రిలీజ్‌ డేట్‌ కన్‌ఫర్మేషన్‌ ఇచ్చేసింది చిత్రబృందం. కేయస్‌ రవీంద్ర (బాబీ) దర్శకత్వంలో వెంకటేశ్, నాగచైతన్య నటించిన ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ ‘వెంకీ మామ’. పాయల్‌ రాజ్‌పుత్, రాశీ ఖన్నా కథానాయికలు. సురేశ్‌బాబు, టీజీ విశ్వప్రసాద్‌ నిర్మించారు. ఈ సినిమాను ఈ నెల 13న రిలీజ్‌ చేస్తున్నట్లు చిత్రబృందం ప్రకటించింది. డిసెంబర్‌ 13 వెంకటేశ్‌ బర్త్‌డే. ఆయన పుట్టిన రోజు సందర్భంగా ఈ సినిమా రిలీజ్‌ కానుంది. ఈ సినిమా రిలీజ్‌ డేట్‌ను దర్శకుడు బాబీ, హీరో రానా ఓ సరదా వీడియో రూపంలో ప్రకటించారు. ఈ చిత్రానికి సంగీతం: యస్‌.యస్‌. తమన్, కెమెరా: ప్రసాద్‌ మూరెళ్ల.

Advertisement
 
Advertisement
Advertisement