గురూ.. నాకు కొంచెం తిక్కుంది | Venky Cameo Scene added to Agnyaathavaasi | Sakshi
Sakshi News home page

Jan 12 2018 1:31 PM | Updated on Mar 22 2019 5:33 PM

Venky Cameo Scene added to Agnyaathavaasi - Sakshi

సాక్షి, సినిమా : పవర్‌ ​స్టార్‌ పవన్‌ కళ్యాణ్‌ నటించిన అజ్ఞాతవాసి చిత్రంలో అగ్ర నటుడు వెంకటేష్‌ ఓ అతిథి పాత్రలో మెరవబోతున్నాడన్న వార్త అప్పట్లో బాగా వినిపించింది. టైటిల్‌ కార్డ్స్‌ లో కూడా వెంకీకి స్పెషల్‌ థ్యాంక్స్‌ ఉండటంతో రోల్‌ ఉంటుందని అంతా భావించారు. కానీ, చిత్రంలో మాత్రం ఆ మెరుపులు లేకుండా పోయాయి. 

దీంతో ఆ సీన్‌ను కలిపేందుకు అజ్ఞాతవాసి మేకర్లు డిసైడ్‌ అయ్యారు. ఈ మేరకు ఓ మేకింగ్‌ వీడియోను విడుదల చేశారు. వెంకీ-పవన్‌ మధ్య నడిచే అ సన్నివేశం కోసం ఇద్దరు స్టార్లు కలిసి డబ్బింగ్‌ చెప్పటం ఆ వీడియోలో ఉంది. 

పవన్‌.. గురువు గారు అంటే.. గారు అక్కర్లేదమ్మా గురూ చాలూ.. అని వెంకీ చెప్పటం... ‘నాకు కొంచెం తిక్కుంది’ అని పవన్‌ అంటే... ‘దానికో లెక్కుంది’ అని మళ్లీ వెంకీ చెప్పటం ఇలా సాగిపోయిన వీడియో ఫన్నీగా ఉంది.  సంక్రాంతి నుంచి ఆ సీన్‌ చిత్రానికి యాడ్‌ చేస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement