వెంకీ–రోహిత్‌ ఓ రీమేక్‌?

Venkatesh and Nara Rohit in Vikram Vedha Telugu remake - Sakshi

విక్రమ్, భేతాళ కథలను ఆధారంగా తీసుకొని తమిళంలో దర్శకద్వయం పుష్కర్‌–గాయత్రి తెరకెక్కించిన చిత్రం ‘విక్రమ్‌వేదా’. మాధవన్, విజయ్‌ సేతుపతి హీరోలుగా తెరకెక్కిన ఈ సినిమా బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. వంద కోట్లు కూడా సాధించింది. ఈ సినిమా తెలుగులో రీమేక్‌ కాబోతోందని కొంత కాలంగా వార్తలు వస్తున్నాయి. అయితే లేటెస్ట్‌గా ఈ రీమేక్‌లో వెంకటేశ్, నారా రోహిత్‌ హీరోలుగా నటిస్తారని సమాచారం. వీవీ వినాయక్‌ దర్శకుడు అని తెలిసింది. మాధవన్‌ చేసిన పాత్రను నారా రోహిత్, విజయ్‌ సేతుపతి రోల్‌లో వెంకటేశ్‌ కనిపిస్తారని సమాచారం. గతంలో వెంకటేశ్‌ – వీవీవినాయక్‌ కాంబినేషన్‌లో వచ్చిన ‘లక్ష్మీ’ సినిమా సూపర్‌హిట్‌గా నిలిచిన సంగతి తెలిసిందే.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top