మామ మామే... అల్లుడు అల్లుడే! | Venkatesh And Naga Chaitanya Multistarrer Movie | Sakshi
Sakshi News home page

మామ మామే... అల్లుడు అల్లుడే!

Sep 10 2017 12:40 AM | Updated on Sep 17 2017 6:39 PM

మామ మామే... అల్లుడు అల్లుడే!

మామ మామే... అల్లుడు అల్లుడే!

వెంకటేశ్‌కు నాగచైతన్య ఏమవుతారు? మేనల్లుడు! చైతూకి వెంకీ? మేనమామ! ఈ మామా అల్లుళ్లు ఇద్దరూ కలసి నటించిన సినిమా ‘ప్రేమమ్‌’.

వెంకటేశ్‌కు నాగచైతన్య ఏమవుతారు? మేనల్లుడు! చైతూకి వెంకీ? మేనమామ! ఈ మామా అల్లుళ్లు ఇద్దరూ కలసి నటించిన సినిమా ‘ప్రేమమ్‌’. అయితే... అందులో వెంకీది అతిథి పాత్రే. కానీ, స్పెషాలిటీ ఏంటంటే.. అందులో వీళ్లిద్దరూ మామా అల్లుళ్లగానే కనిపించారు. దాంతో దగ్గుబాటి–అక్కినేని అభిమానులు ఫుల్‌ ఖుషీ. వాళ్లను మరింత ఖుషీ చేసే మేటర్‌ ఏంటంటే... మరోసారి మామా–అల్లుడు కలసి సినిమా చేసేందుకు రెడీ అవుతున్నారు. మళ్లీ తెరపై మామా అల్లుళ్లగానే కనిపించనున్నారు.

అయితే... ఈసారి ఎవరూ అతిథి పాత్రలు చేయాలనుకోవడం లేదు. ఇద్దరివీ పూర్తి స్థాయి పాత్రలే. మల్టీస్టారర్‌ అన్నమాట! ప్రముఖ రచయిత జనార్థన మహర్షి ఈ మామాఅల్లుళ్ల సినిమాకు స్క్రిప్ట్‌ రాస్తున్నారు. నాగార్జునతో ‘సోగ్గాడే చిన్ని నాయనా’, చైతూతో ‘రారండోయ్‌.. వేడుక చూద్దాం’ వంటి హిట్‌ సిన్మాలు తీసిన కల్యాణ్‌కృష్ణ ఈ క్రేజీ మల్టీస్టారర్‌కు దర్శకత్వం వహించనున్నారని సమాచారం. ప్రస్తుతం కథపై దర్శక–రచయితలు కసరత్తులు చేస్తున్నారు. బౌండ్‌ స్క్రిప్ట్‌ రెడీ అయిన తర్వాత చిత్రీకరణ ప్రారంభించే ఆలోచనలో ఉన్నారట!

Advertisement
 
Advertisement
Advertisement