breaking news
Multistar movie
-
46 ఏళ్ల తర్వాత క్రేజీ మల్టీస్టారర్.. బాక్సాఫీస్ బద్దలే!
రజనీకాంత్, కమల్ హాసన్.. భారతీయ చిత్రపరిశ్రమలో అగ్ర హీరోలుగా ఉన్న వీరిద్దరు కలిసి ఒక సినిమా చేయాలని చాలా మంది సినీ ప్రియులు కోరుకుంటున్నారు. వీళ్ల కాంబోలో సినిమా రాబోతున్నట్లు గత కొంతకాలంగా వార్తలు కూడా వస్తున్నాయి. కానీ అది ఇంతవరకు కార్యరూపం దాల్చలేదు. పైగా ఈ సినిమాపై అటు రజనీ కానీ, ఇటు కమల్ కానీ స్పందించకపోవడంతో.. ఇదంతా పుకారే అనుకున్నారు. కానీ త్వరలోనే సినీ ప్రియుల కల నిజం కాబోతుంది. కమల్, రజనీలను ఒకే స్క్రీన్‌పై చూడబోతున్నారు. తాజాగా ఈ విషయాన్ని కమల్ హాసన్ అధికారికంగా ప్రకటించాడు.ఇటీవల జరిగిన సైమా అవార్డుల వేడుకల్లో పాల్గొన్న కమల్.. రజనీతో సినిమాపై స్పందించాడు. ‘ప్రేక్షకుల సంతోషమే మాకు ముఖ్యం. మేమిద్దరం కలిసి నటించాలని చాలా ఏళ్లుగా ప్రయత్నిస్తున్నాం. కానీ ఇన్నాళ్లు అది కుదరలేదు. త్వరలోనే మేమిద్దరం మీ ముందుకు రాబోతున్నాం. ఆ సినిమా మిమ్మల్ని సర్ప్రైజ్ చేస్తుంది’ అని కమల్ అన్నారు. దీంతో ఇరువురి ఫ్యాన్స్‌తో పాటు సగటు సినీ ప్రేక్షకుడు కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. 1979 లో వచ్చిన అల్లాయుద్దీన్ అద్భుత దీపం తర్వాత వీరిద్దరు కలిసి నటించలేదు. దాదాపు 46 ఏళ్ల తర్వాత మరోసారి స్క్రీన్ షేర్ చేసుకోబుతున్నారు. సినిమాకు కాస్త హిట్ టాక్ వచ్చినా బక్సాఫీస్ బద్దలవుతుందని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అయితే ఈ ప్రాజెక్టుకు సంబంధించిన వివరాలను మాత్రం కమల్ వెళ్లడించలేదు. గతంలో లోకేశ్ కనగరాజ్ దర్శకత్వంలో వీరిద్దరి సినిమా ఉంటుందని రూమర్స్ వచ్చాయి. -
మామ మామే... అల్లుడు అల్లుడే!
వెంకటేశ్‌కు నాగచైతన్య ఏమవుతారు? మేనల్లుడు! చైతూకి వెంకీ? మేనమామ! ఈ మామా అల్లుళ్లు ఇద్దరూ కలసి నటించిన సినిమా ‘ప్రేమమ్’. అయితే... అందులో వెంకీది అతిథి పాత్రే. కానీ, స్పెషాలిటీ ఏంటంటే.. అందులో వీళ్లిద్దరూ మామా అల్లుళ్లగానే కనిపించారు. దాంతో దగ్గుబాటి–అక్కినేని అభిమానులు ఫుల్ ఖుషీ. వాళ్లను మరింత ఖుషీ చేసే మేటర్ ఏంటంటే... మరోసారి మామా–అల్లుడు కలసి సినిమా చేసేందుకు రెడీ అవుతున్నారు. మళ్లీ తెరపై మామా అల్లుళ్లగానే కనిపించనున్నారు. అయితే... ఈసారి ఎవరూ అతిథి పాత్రలు చేయాలనుకోవడం లేదు. ఇద్దరివీ పూర్తి స్థాయి పాత్రలే. మల్టీస్టారర్ అన్నమాట! ప్రముఖ రచయిత జనార్థన మహర్షి ఈ మామాఅల్లుళ్ల సినిమాకు స్క్రిప్ట్ రాస్తున్నారు. నాగార్జునతో ‘సోగ్గాడే చిన్ని నాయనా’, చైతూతో ‘రారండోయ్.. వేడుక చూద్దాం’ వంటి హిట్ సిన్మాలు తీసిన కల్యాణ్‌కృష్ణ ఈ క్రేజీ మల్టీస్టారర్‌కు దర్శకత్వం వహించనున్నారని సమాచారం. ప్రస్తుతం కథపై దర్శక–రచయితలు కసరత్తులు చేస్తున్నారు. బౌండ్ స్క్రిప్ట్ రెడీ అయిన తర్వాత చిత్రీకరణ ప్రారంభించే ఆలోచనలో ఉన్నారట! -
మణిరత్నం చిత్రంలో కీర్తీసురేష్?
తమిళసినిమా: మణిరత్నం తన చిత్రాల్లో కథానాయికలను అందంగా చూపిస్తారు. అదే సమయంలో వారి కథా పాత్రలకు ప్రాధాన్యత ఉంటుంది. అందుకే ఐశ్వర్యారాయ్ నుంచి వర్ధమాన నటీమణుల వరకూ మణిరత్నం చిత్రాల్లో నటించడానికి ఆసక్తి చూపిస్తారు. మణిరత్నం గత చిత్రం కాట్రువెలియిడై. కార్తీ, అతిథిరావు జంటగా నటించిన ఈ చిత్రం ప్రేక్షకుల మధ్య మిశ్రమ స్పందననే అందుకోగలిగింది. కాగా మణి తదుపరి చిత్రం ఏమిటన్నది ఆసక్తిగా మారింది. ఈ విషయంలో రకరకాల ప్రచారాలు హల్చల్ చేస్తున్నాయి. టాలీవుడ్ స్టార్ హీరో రామ్‌చరణ్‌తో చిత్రం అంటూ ప్రచారం జరిగింది. ఆ తరువాత విజయ్‌సేతుపతి హీరోగా చిత్రం మొదలవ్వనుందనే ఊహాగానాలు తెరపైకొచ్చాయి. తాజాగా మణిరత్నం మాస్ మసాలా ఎంటర్టెయినర్గా మల్టీస్టారర్ చిత్రానికి రెడీ అవుతున్నారనే ప్రచారం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇందులో దుల్కర్సల్మాన్, అరవిందస్వామి, ఫాహత్ ఫాజిల్ ముగ్గురు హీరోలు నటించనున్నారని, వారికి జంటగా ముగ్గురు హీరోయిన్లు ఉంటారని, అందులో ఒక నాయకిగా నటి కీర్తీసురేశ్‌ను ఎంపిక చేసే ప్రయత్నంలో ఉన్నారని తాజా సమాచారం. ఈ క్రేజీ ప్రాజెక్ట్‌కు సంబంధించిన పూర్తి వివరాలు త్వరలోనే వెల్లడయ్యే అవకాశం ఉన్నట్లు సమాచారం.