
రజనీకాంత్, కమల్ హాసన్.. భారతీయ చిత్రపరిశ్రమలో అగ్ర హీరోలుగా ఉన్న వీరిద్దరు కలిసి ఒక సినిమా చేయాలని చాలా మంది సినీ ప్రియులు కోరుకుంటున్నారు. వీళ్ల కాంబోలో సినిమా రాబోతున్నట్లు గత కొంతకాలంగా వార్తలు కూడా వస్తున్నాయి. కానీ అది ఇంతవరకు కార్యరూపం దాల్చలేదు. పైగా ఈ సినిమాపై అటు రజనీ కానీ, ఇటు కమల్ కానీ స్పందించకపోవడంతో.. ఇదంతా పుకారే అనుకున్నారు. కానీ త్వరలోనే సినీ ప్రియుల కల నిజం కాబోతుంది. కమల్, రజనీలను ఒకే స్క్రీన్పై చూడబోతున్నారు. తాజాగా ఈ విషయాన్ని కమల్ హాసన్ అధికారికంగా ప్రకటించాడు.
ఇటీవల జరిగిన సైమా అవార్డుల వేడుకల్లో పాల్గొన్న కమల్.. రజనీతో సినిమాపై స్పందించాడు. ‘ప్రేక్షకుల సంతోషమే మాకు ముఖ్యం. మేమిద్దరం కలిసి నటించాలని చాలా ఏళ్లుగా ప్రయత్నిస్తున్నాం. కానీ ఇన్నాళ్లు అది కుదరలేదు. త్వరలోనే మేమిద్దరం మీ ముందుకు రాబోతున్నాం. ఆ సినిమా మిమ్మల్ని సర్‌ప్రైజ్ చేస్తుంది’ అని కమల్ అన్నారు.
దీంతో ఇరువురి ఫ్యాన్స్తో పాటు సగటు సినీ ప్రేక్షకుడు కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. 1979 లో వచ్చిన అల్లాయుద్దీన్ అద్భుత దీపం తర్వాత వీరిద్దరు కలిసి నటించలేదు. దాదాపు 46 ఏళ్ల తర్వాత మరోసారి స్క్రీన్ షేర్ చేసుకోబుతున్నారు. సినిమాకు కాస్త హిట్ టాక్ వచ్చినా బక్సాఫీస్ బద్దలవుతుందని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అయితే ఈ ప్రాజెక్టుకు సంబంధించిన వివరాలను మాత్రం కమల్ వెళ్లడించలేదు. గతంలో లోకేశ్ కనగరాజ్ దర్శకత్వంలో వీరిద్దరి సినిమా ఉంటుందని రూమర్స్ వచ్చాయి.