మణిరత్నం చిత్రంలో కీర్తీసురేష్‌? | Mani Ratnam's next film is KeerthiSuresh? | Sakshi
Sakshi News home page

మణిరత్నం చిత్రంలో కీర్తీసురేష్‌?

Aug 7 2017 1:32 AM | Updated on Oct 22 2018 6:05 PM

మణిరత్నం చిత్రంలో కీర్తీసురేష్‌? - Sakshi

మణిరత్నం చిత్రంలో కీర్తీసురేష్‌?

మణిరత్నం తన చిత్రాల్లో కథానాయికలను అందంగా చూపిస్తారు.

తమిళసినిమా: మణిరత్నం తన చిత్రాల్లో కథానాయికలను అందంగా చూపిస్తారు. అదే సమయంలో వారి కథా పాత్రలకు ప్రాధాన్యత ఉంటుంది. అందుకే ఐశ్వర్యారాయ్‌  నుంచి వర్ధమాన నటీమణుల వరకూ మణిరత్నం చిత్రాల్లో నటించడానికి ఆసక్తి చూపిస్తారు. మణిరత్నం గత చిత్రం కాట్రువెలియిడై. కార్తీ, అతిథిరావు జంటగా నటించిన ఈ చిత్రం ప్రేక్షకుల మధ్య మిశ్రమ స్పందననే అందుకోగలిగింది. కాగా మణి తదుపరి చిత్రం ఏమిటన్నది ఆసక్తిగా మారింది.

ఈ విషయంలో రకరకాల ప్రచారాలు హల్‌చల్‌ చేస్తున్నాయి. టాలీవుడ్‌ స్టార్‌ హీరో రామ్‌చరణ్‌తో చిత్రం అంటూ ప్రచారం జరిగింది. ఆ తరువాత విజయ్‌సేతుపతి హీరోగా చిత్రం మొదలవ్వనుందనే ఊహాగానాలు తెరపైకొచ్చాయి. తాజాగా మణిరత్నం మాస్‌ మసాలా ఎంటర్‌టెయినర్‌గా మల్టీస్టారర్‌ చిత్రానికి రెడీ అవుతున్నారనే ప్రచారం సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. ఇందులో దుల్కర్‌సల్మాన్, అరవిందస్వామి, ఫాహత్‌ ఫాజిల్‌ ముగ్గురు హీరోలు నటించనున్నారని, వారికి జంటగా ముగ్గురు హీరోయిన్లు ఉంటారని, అందులో ఒక నాయకిగా నటి కీర్తీసురేశ్‌ను ఎంపిక చేసే ప్రయత్నంలో ఉన్నారని తాజా సమాచారం. ఈ క్రేజీ ప్రాజెక్ట్‌కు సంబంధించిన పూర్తి వివరాలు త్వరలోనే వెల్లడయ్యే అవకాశం ఉన్నట్లు సమాచారం.

Advertisement
 
Advertisement
Advertisement