బాక్సింగ్‌కి సిద్ధం | Varun Tej to train under wbc chamoian Neeraj Goyat | Sakshi
Sakshi News home page

బాక్సింగ్‌కి సిద్ధం

Jan 20 2020 12:09 AM | Updated on Jan 20 2020 12:09 AM

Varun Tej to train under wbc chamoian Neeraj Goyat - Sakshi

వరుణ్‌తేజ్

బాక్సింగ్‌ గ్లౌజ్స్‌తో ముంబై ప్రయాణమయ్యారు వరుణ్‌తేజ్‌. కొన్నిరోజుల పాటు బాక్సింగ్‌ శిక్షణలో బిజీగా ఉండబోతున్నారు. నూతన దర్శకుడు కిరణ్‌ కొర్రపాటి డైరెక్షన్‌లో వరుణ్‌తేజ్‌ హీరోగా బాక్సింగ్‌ నేపథ్యంలో ఓ సినిమా తెరకెక్కనుంది. ఇందులో వరుణ్‌ బాక్సర్‌ పాత్రలో నటించనున్నారు. అల్లు అరవింద్‌ సమర్పణలో అల్లు వెంకటేశ్, సిద్ధు ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. బాక్సర్‌ పాత్రలో నటించడానికి అమెరికాలో బాక్సింగ్‌ గోల్డ్‌ మెడలిస్ట్‌ టోనీ జెఫ్రీస్‌ దగ్గర శిక్షణ తీసుకున్నారు వరుణ్‌. ఇప్పుడు ఇండియన్‌ బాక్సర్‌ నీరజ్‌ గోయాత్‌ దగ్గర కూడా బాక్సింగ్‌కి సంబంధించిన మెళకువలు నేర్చుకోనున్నారు. ప్రపంచ బాక్సింగ్‌ ర్యాంకింగ్స్‌లో ప్రవేశించిన తొలి భారతీయ బాక్సర్‌ నీరజ్‌. ఆయన దగ్గర బాక్సింగ్‌ ట్రిక్స్‌ నేర్చుకున్న తర్వాత ఈ సినిమా షూటింగ్‌లో పాల్గొంటారు వరుణ్‌. ఈ సినిమాలో హీరోయిన్‌ ఎవరనేది ఇంకా ప్రకటించలేదు. కియారా అద్వానీ పేరును పరిశీలిస్తున్నారని సమాచారం.

Advertisement
 
Advertisement
Advertisement