కొత్త చాప్టర్‌ షురూ | varun tej new movie valmiki movie launch | Sakshi
Sakshi News home page

కొత్త చాప్టర్‌ షురూ

Jan 28 2019 4:29 AM | Updated on Jan 28 2019 4:29 AM

varun tej new movie valmiki movie launch - Sakshi

గోపీ ఆచంట, హరీష్‌ శంకర్, రామ్‌ ఆచంట, బాపినీడు, నవీన్‌ ఎర్నేని, ‘దిల్‌’ రాజు, వరుణ్‌ తేజ్‌

సినిమాల ఎంపికలో వైవిధ్యానికి పెద్దపీట వేస్తుంటారు వరుణ్‌ తేజ్‌. విభిన్నమైన పాత్రలను ఎంపిక చేసుకుంటూ ప్రేక్షకులకు మరింత చేరువ అవుతున్నారు. వరుణ్‌ నటించనున్న తాజా చిత్రానికి ‘వాల్మీకి’ అనే పేరును ఖరారు చేశారు. హరీష్‌ శంకర్‌ దర్శకత్వంలో 14 రీల్స్‌ ప్లస్‌ బ్యానర్‌పై రామ్‌ ఆచంట, గోపీ ఆచంట నిర్మించనున్న ఈ సినిమా ఆదివారం హైదరాబాద్‌లో ప్రారంభమైంది. రామ్‌ బొబ్బ కెమెరా స్విచ్చాన్‌ చేయగా, నటి, వరుణ్‌ తేజ్‌ చెల్లెలు నిహారిక కొణిదెల క్లాప్‌ ఇచ్చారు. దర్శకులు వీవీ వినాయక్‌ తొలి సన్నివేశానికి గౌరవ దర్శకత్వం వహించారు.

‘‘నా తర్వాతి చిత్రానికి ‘వాల్మీకి’ అనే టైటిల్‌ ఖరారు చేశాం. కొత్త చాప్టర్‌ మొదలైంది’’ అని ఈ సందర్భంగా వరుణ్‌ తేజ్‌ పేర్కొన్నారు. ‘‘మా ‘వాల్మీకి’ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్‌ సంగీతం అందిస్తారు. ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని విశేషాలను త్వరలోనే తెలియజేస్తాం’’ అని చిత్రబృందం పేర్కొంది. డైరెక్టర్‌ సుకుమార్, నిర్మాత ‘దిల్‌’ రాజుతో పాటు పలువురు ఈ ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు. ఈ చిత్రానికి ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌: హరీష్‌ కట్టా. కాగా, తమిళ హిట్‌ చిత్రం ‘జిగర్తాండ’ కి ‘వాల్మీకి’ తెలుగు రీమేక్‌ అనే సంగతి తెలిసిందే.

Advertisement
 
Advertisement
Advertisement