షూటింగ్‌ షురూ | Varun Tej New Movie Opening | Sakshi
Sakshi News home page

షూటింగ్‌ షురూ

Feb 25 2020 12:18 AM | Updated on Feb 25 2020 12:18 AM

Varun Tej New Movie Opening - Sakshi

వరుణ్‌ తేజ్‌

బాక్సింగ్‌కు సంబంధించిన శిక్షణ పూర్తయింది. దాన్ని స్క్రీన్‌ మీద చూపించడానికి రెడీ అయ్యారు వరుణ్‌ తేజ్‌. బాక్సింగ్‌ బ్యాక్‌డ్రాప్‌లో వరుణ్‌ తేజ్‌ హీరోగా తెరకెక్కనున్న తాజా చిత్రం సోమవారం సెట్స్‌ మీదకు వెళ్లింది. నూతన దర్శకుడు కిరణ్‌ కొర్రపాటి దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. అల్లు అరవింద్‌ సమర్పణలో అల్లు వెంకటేశ్, సిద్ధూ ముద్ద నిర్మిస్తున్నారు. ఈ సినిమా రెగ్యులర్‌ షూటింగ్‌ వైజాగ్‌లో ప్రారంభం అయింది. ఇందులో బాలీవుడ్‌ హీరోయిన్‌ సాయీ మంజ్రేకర్‌ హీరోయిన్‌గా నటించబోతున్నారని టాక్‌. జూలై 30న ఈ సినిమాను విడుదల చేయాలనుకుంటున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement