'శక్తి'గా వస్తున్న స్టార్ వారసురాలు

Vara Laxmi Shakthi

కోలీవుడ్ సీనియర్ నటుడు శరత్ కుమార్ వారసురాలిగా వెండితెరకు పరిచయం అయిన నటి వరలక్ష్మీ శరత్ కుమార్. కోలీవుడ్ లో గ్లామర్ హీరోయిన్ గా సత్తా చాటిన ఈ భామ ఇప్పుడు నటనకు ఆస్కారం ఉన్న పాత్రల మీద దృష్టి పెట్టింది. విశాల్ తో ప్రేమాయణం నేపథ్యంలో తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితమైన ఈ భామ త్వరలో ఓ తెలుగు సినిమాతో ఆడియన్స్ ముందుకు రానుంది.

శక్తి పేరుతో తెరకెక్కుతున్న ఈ మూడు భాషల్లో తెరకెక్కుతున్న ఈ సినిమా తెలుగు ఫస్ట్ లుక్ పోస్టర్ ను టాలీవుడ్ హీరో రానా రిలీజ్ చేశాడు. ప్రియదర్శిని దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో వరలక్ష్మీ శరత్ కుమార్ పూర్తి డిఫరెంట్ మేకోవర్ లో దర్శనమిస్తోంది.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top