breaking news
Vara Lakshmi Sharath Kumar
-
డైరెక్షన్ మారింది!
ఇప్పటివరకూ తెరపై యాక్టర్స్‌గా తమదైన శైలిలో నటించి, ప్రేక్షకుల మన్ననలను పొందిన కొందరు స్టార్స్ ఇప్పుడు మెగాఫోన్ పట్టారు. దర్శకులుగా తమ సత్తా చాటడానికి రెడీ అయిన ఆ యాక్టర్స్ గురించి తెలుసుకుందాం.యాక్టర్స్ డైరెక్టర్స్‌గా మారడం సినిమా ఇండస్ట్రీలో కొత్తేం కాదు. అయితే ఏదో ఐదూ పదీ సినిమాలు చేశాక డైరెక్టర్లుగా మారడం కాదు... సుదీర్ఘకాలం యాక్టర్స్‌గా కొనసాగిన కొంతమంది తమ డైరెక్షన్‌ను మార్చి, దర్శకులుగా పరిచయం అవుతున్నారు. అలాగే సాంకేతిక నిపుణులుగా సక్సెస్ అయిన కొంతమంది దర్శకులు, సంగీత దర్శకులు యాక్టర్స్‌గా పరిచయం కానున్నారు. ఇలా తమ కెరీర్లో కాస్త డైరెక్షన్ మార్చిన కొందరిపై మీరూ ఓ లుక్ వేయండి.ఇక తెరవెనక కూడా...సూపర్ హీరో సాహసాలుబాలీవుడ్లో ‘క్రిష్’ ఫ్రాంచైజీ సినిమాకు ఆడియన్స్‌లో మంచి క్రేజ్ ఉంది. ఈ సూపర్ హీరో సినిమాకు తెలుగులోనూ మంచి ఆదరణ ఉంది. ఈ ‘క్రిష్’ ఫ్రాంచైజీ నుంచి రానున్న తాజా చిత్రం ‘క్రిష్ 4’. హృతిక్ రోషన్ హీరోగా ఈ సినిమాను రెండేళ్ల క్రితమే అధికారికంగా ప్రకటించారు. కానీ కొన్ని కారణాల వల్ల ఈ సినిమా ఇంకా సెట్స్‌కు వెళ్లలేదు. తొలుత ఈ సినిమాకు ప్రముఖ దర్శక–నిర్మాత, హృతిక్ తండ్రి రాకేష్ రోషన్ దర్శకత్వం వహించనున్నట్లుగా వార్తలు వచ్చాయి. కానీ అనారోగ్య కారణాల వల్ల ఆయన ఈ ప్రాజెక్ట్ నుంచి దర్శకుడిగా తప్పుకున్నారు.ఆ తర్వాత హృతిక్ రోషన్‌తో ‘బ్యాంగ్ బ్యాంగ్, వార్’ వంటి బాక్సాఫీస్ హిట్ సినిమాలను తెరకెక్కించిన దర్శకుడు íసిద్ధార్థ్ ఆనంద్ పేరు ‘క్రిష్ 4’కి దర్శకుడిగా వినిపించింది. కానీ ఈ చిత్రానికి తాను దర్శకత్వం వహించడం లేదని, ఓ సందర్భంలో సిద్ధార్థ్ ఆనంద్ పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ‘క్రిష్ 4’ సినిమాకు తన కొడుకు హృతిక్ రోషన్ డైరెక్షన్ చేస్తాడని, ఈ సూపర్ హీరో సాహసాలను తనదైన స్టైల్లో తెరకెక్కించడానికి హృతిక్ రోషన్ సిద్ధంగా ఉన్నారని రాకేష్ రోషన్ చెప్పారు.తన 25 సంవత్సరాల సినీ కెరీర్లో హృతిక్ రోషన్ దర్శకత్వం వహించనున్న తొలి సినిమా ఇదే కావడం విశేషం. యశ్‌రాజ్ ఫిలింస్ పతాకంపై ఆదిత్య చోప్రా ఈ ‘క్రిష్ 4’ సినిమాను నిర్మించనున్నారని బాలీవుడ్ సమాచారం. కాగా, హృతిక్ రోషన్–నిర్మాత ఆదిత్య చోప్రా కాంబినేషన్లో ఇటీవల వచ్చిన ‘వార్ 2’ చిత్రం బాక్సాఫీస్ వద్ద విఫలమైంది. దీంతో ఈ ప్రభావం ‘క్రిష్ 4’ చిత్రంపై పడే అవకాశం ఉందని, దీంతో ‘క్రిష్ 4’ సినిమా సెట్స్‌కు వెళ్లడానికి మరికొంత సమయం పడుతుందనే టాక్ బాలీవుడ్ సినీ సర్కిల్స్‌లో వినిపిస్తోంది.మకుటంరెండు దశాబ్దాలుగా యాక్టర్‌గా ఇండస్ట్రీలో రాణిస్తూ, తన సత్తా చాటుకుంటున్నారు హీరో విశాల్. ఇప్పుడు దర్శకుడిగా విశాల్ తొలిసారిగా మెగాఫోన్ పట్టారు. విశాల్ హీరోగా నటిస్తున్న తమిళ చిత్రం ‘మగుడం’. ఈ సినిమాకు తెలుగులో ‘మకుటం’ అనే టైటిల్ ఖరారు చేశారు. స్టంట్ కొరియోగ్రాఫర్ రవి అరసు దర్శకుడిగా ఈ సినిమా చిత్రీకరణ ప్రారంభమైంది. కానీ విశాల్‌కు, రవి అరసుకు మధ్య క్రియేటివ్ డిఫరెన్సెస్ రావడంతో ఈ సినిమా దర్శకత్వ బాధ్యతలను కూడా స్వీకరించారు విశాల్. కొన్ని అనివార్య పరిస్థితుల కారణంగా ‘మకుటం’ సినిమాకు దర్శకత్వం వహించాల్సి వచ్చిందని, ఈ విషయాన్ని సీక్రెట్‌గా ఉంచాల్సిన అవసరం లేదని ఇటీవల విశాల్ పేర్కొన్నారు. అలాగే తాను తొలిసారిగా దర్శకత్వం వహిస్తున్నందుకు చాలా సంతోషంగా ఉందని తెలిపారు విశాల్. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ చెన్నైలో జరుగుతోంది. భారీ స్థాయిలో క్లై్లమాక్స్ ఎపిసోడ్‌ను చిత్రీకరిస్తున్నారని సమాచారం. ఈ చిత్రంలో కృపాకర్ అనే పాత్రలో విశాల్ కనిపిస్తారట. ఇంకా ఈ చిత్రంలో దుషారా విజయన్, అంజలి, తంబి రామయ్య ఇతర ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. సూపర్‌గుడ్ ఫిల్మ్స్ పతాకంపై ఆర్బీ చౌదరి ‘మకుటం’ను నిర్మిస్తున్నారు. ఈ సినిఆర్డినరీ మ్యాన్ఇండస్ట్రీలో హీరోగా ఇరవై సంవత్సరాల సక్సెస్ఫుల్ కెరీర్‌ను పూర్తి చేసుకున్న తర్వాత రవి మోహన్ (‘జయం’ రవి) ఇటీవల రవి మోహన్ స్టూడియోస్ అనే నిర్మాణ సంస్థను ప్రారంభించారు. ఈ రవి మోహన్ స్టూడియోస్‌లో సినిమాలు, ఓటీటీ ప్రాజెక్ట్స్‌ను తెరకెక్కించనున్నట్లుగా ఆయన తెలిపారు. అంతే కాదు... తన నిర్మాణ సంస్థలోని ‘యాన్ ఆర్డినరీ మ్యాన్’ చిత్రంతో దర్శకుడిగా మారారు రవి మోహన్. ఈ హీరోకి దర్శకుడిగా ఇదే తొలి చిత్రం కావడం విశేషం. ఈ సినిమాలో యోగిబాబు లీడ్ రోల్లో నటిస్తారు. రవి మోహన్ కూడా ఓ కీలక పాత్రలో నటించనున్నారనే టాక్ కోలీవుడ్‌లో వినిపిస్తోంది. ఒక ఆర్డినరీ మ్యాన్ లైఫ్ ఎలా ఉంటుంది? అన్నదే ఈ సినిమా ప్రధాన కథాంశమని సమాచారం.వీరే కాదు... మరికొందరు హీరోలు, హీరోయిన్లు దర్శకులుగా మారేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని టాక్. మరోవైపు ఈ ఏడాది విడుదలైన ‘ఫతే’ చిత్రంతో సోనూ సూద్, ‘ది మెహతా బాయ్స్’ చిత్రంతో బొమన్ ఇరానీ వంటి ప్రముఖ నటులు ఆల్రెడీ దర్శకులుగా పరిచయం అయిన సంగతి తెలిసిందే.ఎల్లమ్మలో...రెండు దశాబ్దాలకు పైగా ఇండస్ట్రీలో సంగీత దర్శకుడిగా రాణిస్తున్నారు దేవిశ్రీ ప్రసాద్. కొన్ని పాటల్లో గెస్ట్ అప్పియరెన్స్ కూడా ఇచ్చారు. కానీ ఇప్పుడు పూర్తి స్థాయిలో యాక్టర్‌గా వెండితెరపై కనిపించనున్నారట దేవిశ్రీ ప్రసాద్. ‘బలంగం’ వంటి సూపర్ హిట్ చిత్రం తర్వాత వేణు యెల్దండి రూరల్ బ్యాక్‌డ్రాప్‌లో ‘ఎల్లమ్మ’ అనే సినిమా చేయనున్నారు. ఈ చిత్రంలో హీరోలంటూ నాని, నితిన్, శర్వానంద్ వంటి వార్ల పేర్లు వినిపించాయి.కానీ ఫైనల్‌గా ఈ చాన్స్ దేవిశ్రీ ప్రసాద్‌కు లభించిందట. ఈ ‘ఎల్లమ్మ’ చిత్రంలో దేవిశ్రీ ప్రసాద్ హీరోగా నటిస్తారని, హీరోయిన్గా కీర్తీ సురేష్ కనిపిస్తారనే టాక్ ఫిల్మ్‌నగర్ సర్కిల్స్‌లో వినిపిస్తోంది. ‘దిల్’ రాజు ఈ సినిమాను నిర్మించనున్నారట. వచ్చే ఏడాది ఈ సినిమా షూటింగ్‌ను ప్రారంభించాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారని తెలిసింది. అలాగే ఈ సినిమాకు తొలుత తమిళ సంగీత దర్శక ద్వయం వివేక్–మెర్విన్‌లు స్వరాలు సమకూర్చనున్నారనే టాక్ తెరపైకి వచ్చింది. కానీ హీరోగా నటించడంతో పాటు ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించనున్నారనే టాక్ కూడా తాజాగా తెరపైకి వచ్చింది. ఈ విషయాలపై అధికారిక సమాచారం అందాల్సి ఉంది.మళ్లీ యాక్టర్‌గా...సంగీత దర్శకుడిగా తమన్ ఎంత బిజీగా ఉంటారో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. ఈ బిజీ టైమ్‌లోనూ యాక్టర్‌గా తమన్ ఓ సినిమా చేస్తున్నారు. అదే ‘ఇదయమ్ మురళి’ మూవీ. అథర్వ మురళి ఈ చిత్రంలో హీరోగా నటిస్తున్నారు. కయాదు లోహర్, ప్రీతి ముకుందన్ హీరోయిన్స్‌గా నటిస్తుండగా తమన్, నిహారిక ఎన్ఎమ్, ప్రగ్య కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఆకాశ్ భాస్కరన్ ఈ సినిమాకు దర్శకుడు. ఆల్రెడీ ‘ఇదయమ్ మురళి’ సినిమాను ప్రకటించారు.షూటింగ్ కూడా మొదలైంది. మేజర్ షూటింగ్ విదేశాల్లో జరుగుతోంది. వచ్చే ఏడాది ప్రేమికుల దినోత్సవానికి ఈ సినిమా విడుదల కానుందనే టాక్ వినిపిస్తోంది. ఇక యాక్టర్‌గా తమన్‌కు ఇది తొలి చిత్రం కాదు. ఆ మాటకొస్తే... తమన్ కెరీర్ యాక్టర్‌గానే మొదలైంది. 2003లో శంకర్ దర్శకత్వంలో వచ్చిన ‘బాయ్స్’ చిత్రంలో తమన్ ఓ కీలక పాత్రలో నటించారు. ఆ తర్వాత గెస్ట్ రోల్స్‌లో కనిపించినా కొంత గ్యాప్ తర్వాత తమన్ కీలక పాత్రలో నటిస్తున్నది మాత్రం ‘ఇదయమ్ మురళి’ సినిమాలోనే. మరో విశేషం ఏంటంటే... ఈ సినిమాకు తమన్ సంగీతం కూడా అందిస్తున్నారు.ప్రేమకథఅడివి శేష్ హీరోగా నటిస్తున్న ‘డెకాయిట్’ చిత్రంతో సినిమాటోగ్రాఫర్ షానియల్ డియో దర్శకుడిగా మారారు. గతంలో అడివి శేష్ హీరోగా నటించిన ‘క్షణం, గూఢచారి’ వంటి సినిమాలకు షానియల్ సినిమాటోగ్రాఫర్‌గా వర్క్ చేశారు. ప్రేమ, ప్రతీకారం నేపథ్యంలో రూపొందుతున్న ‘డెకాయిట్’ సినిమాలో మృణాల్ ఠాకూర్ హీరోయిన్గా నటిస్తున్నారు. అనురాగ్ కశ్యప్ కీలక పాత్రలో కనిపిస్తారు. సుప్రియ యార్లగడ్డ, సునీల్ నారంగ్ నిర్మిస్తున్న ఈ సినిమా 2026 మార్చి 19న విడుదల కానుంది.యాక్షన్ డ్రామా‘కల్కి 2898 ఏడీ, కేజీఎఫ్, ఖైదీ, అమరన్..’ వంటి బ్లాక్‌బస్టర్ సినిమాలకు స్టంట్ కొరియోగ్రాఫర్స్‌గా పని చేసిన అన్బు–అరివులు దర్శకులుగా మారారు. ఈ చిత్రంలో కమల్‌హాసన్ హీరోగా నటించనున్నారు. 2024లోనే ఈ సినిమాను అధికారికంగా ప్రకటించారు. త్వరలో ఈ సినిమా చిత్రీకరణ ప్రారంభం కానుంది. పూర్తి స్థాయి యాక్షన్ డ్రామాగా ఈ చిత్రం తెరకెక్కనుంది.ఎల్యూసీలో డీసీ?‘మా నగరం’ సినిమాతో దర్శకుడిగా పాపులర్ అయ్యారు లోకేశ్ కనగరాజ్. నెక్ట్స్ మూవీ ‘ఖైదీ’ బ్లాక్ బస్టర్ కావడంతో లోకేశ్ తమిళ చిత్ర పరిశ్రమలో స్టార్ డైరెక్టర్ అయ్యారు. ఈ స్టార్ హోదాకు తగ్గట్లే లోకేశ్ కనగరాజ్‌కు కమల్‌హాసన్‌తో ‘విక్రమ్’, రజనీకాంత్‌తో ‘కూలీ’, విజయ్‌తో ‘లియో, మాస్టర్’ వంటి చిత్రాలను తెరకెక్కించే చాన్స్ దక్కింది. స్టార్ హీరోలతో సినిమాలు చేసిన ఈ తమిళ స్టార్ డైరెక్టర్ నిర్మాతగా కూడా సినిమాలు చేస్తున్నారు. రైటర్‌గానూ చేస్తున్నారు. ఇదే స్పీడ్‌లో హీరోగానూ సత్తా చాటాలని నిర్ణయించుకుని, ‘డీసీ’ అనే మూవీని స్టార్ట్ చేశారు లోకేశ్.గతంలో ఒకట్రెండు సినిమాల్లో గెస్ట్ రోల్లో, ఓ మ్యూజిక్ వీడియోలో లోకేశ్ యాక్టర్‌గా కనిపించినా, ‘డీసీ’లో మాత్రం పూర్తి స్థాయిలో హీరోగా నటిస్తున్నారు. ధనుష్‌తో ‘కెప్టెన్ మిల్లర్’ తీసిన దర్శకుడు అరుణ్ మాథేశ్వరన్ ఈ ‘డీసీ’ సినిమాకు దర్శకత్వం వహిస్తుండగా బాలీవుడ్ హీరోయిన్ వామికా గబ్బి హీరోయిన్గా నటిస్తున్నారు. ఈ చిత్రంలో దేవ దాస్‌గా లోకేశ్, చంద్రగా వామిక నటిస్తున్నారు. ఈ గ్యాంగ్‌స్టర్ డ్రామాను సన్ పిక్చర్స్ సంస్థ నిర్మిస్తోంది. ఈ సినిమాను వచ్చే ఏడాది వేసవిలో రిలీజ్మిస్టర్ సత్యతమిళ సూపర్ డూపర్ హిట్ ఫిల్మ్ ‘టూరిస్ట్ ఫ్యామిలీ’ దర్శకుడు అభిషాన్ జీవంత్ హీరోగా ఓ సినిమా తెరకెక్కుతోంది. ‘టూరిస్ట్ ఫ్యామిలీ’లో అభిషాన్ నటించినప్పటికీ ఈ చిత్రంలో తనది కీలక పాత్ర మాత్రమే. కాగా అభిషాన్ ఫుల్ లెంగ్త్ హీరోగా ఓ సినిమా రూపొందుతోంది. ఆల్రెడీ ఈ సినిమాను అధికారికంగా ప్రకటించారు మేకర్స్. ఇంకా టైటిల్ ఖరారు కాని ఈ చిత్రంలో సత్య అనే పాత్రలో నటిస్తున్నారు అభిషాన్.ఈ చిత్రంలో మలయాళ నటి అనస్వర రాజన్ హీరోయిన్గా నటిస్తున్నారని తెలిసింది. ఈ రొమాంటిక్ కామెడీ సినిమాకు రజనీకాంత్ కుమార్తె సౌందర్య రజనీకాంత్ ఓ నిర్మాతగా ఉన్నారు. ఈ సినిమాను కేవలం 45 రోజుల్లోనే చిత్రీకరించారట మేకర్స్. ఈ సినిమా వచ్చే ఏడాది థియేటర్స్‌లో రిలీజ్ కానుందట. ప్రేమికుల రోజు సందర్భంగా రిలీజ్ చేయాలనుకుంటున్నారని సమాచారం.ఇలా... దర్శకులుగా మారుతున్న టెక్నీషియన్స్ మరికొంతమంది ఉన్నారు.సరస్వతి నటిగా వరలక్ష్మీ శరత్‌కుమార్ గురించి ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. ‘క్రాక్, నాంది, హనుమాన్, యశోద’ వంటి స్ట్రయిట్ తెలుగు సినిమాలు కూడా చేశారామె. కథ ప్రకారం కొన్నిసార్లు క్యారెక్టర్ ఆర్టిస్టుగా కనిపిస్తే, ఇంకొన్నిసార్లు విలన్‌గా మెప్పించారు. అయితే వరలక్ష్మీ శరత్ కుమార్ తన సినీ కెరీర్లో మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. ‘సరస్వతి’ సినిమాతో తాను దర్శకురాలిగా మారుతున్నట్లుగా వరలక్ష్మీ శరత్‌కుమార్ ఇటీవల ప్రకటించారు. ఈ థ్రిల్లర్ సినిమాలో ప్రియమణి, నవీన్‌చంద్ర, ప్రకాశ్‌రాజ్ ప్రధానపాత్రల్లో నటిస్తున్నారు.వరలక్ష్మీ శరత్‌కుమార్ కూడా ఓ కీలకపాత్రలో నటించనున్నట్లుగా తెలిసింది. ఈ సినిమాను తెలుగు, తమిళ భాషలతోపాటు హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో కూడాపాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ చేయాలని ΄్లాన్ చేశారు వరలక్ష్మీ శరత్‌కుమార్. తన సోదరి పూజా శరత్‌కుమార్‌తో కలిసి దోశ డైరీస్ పతాకంపై ‘సరస్వతి’ సినిమాను నిర్మిస్తున్నారామె. ఈ సినిమాకు తమన్ సంగీతం అందించనున్నారు. ఈ సంగతి ఇలా ఉంచితే... గతంలో ‘కన్నామూచ్చి’ అనే సినిమాతో వరలక్ష్మీ శరత్‌కుమార్ దర్శకురాలిగా మారతారన్న వార్తలు వచ్చాయి. కానీ ఈ చిత్రం పూర్తి స్థాయిలో సెట్స్‌కు వెళ్లలేదన్న వార్తలు ఉన్నాయి.పీరియాడికల్ డ్రామా రామ్‌చరణ్ హీరోగా పరిచయం అయిన ‘చిరుత’ సినిమాలో హీరోయిన్గా నటించిన నేహా శర్మ గుర్తుండే ఉంటారు. ఈ సినిమా తర్వాత నేహా శర్మ హిందీ, పంజాబీల్లో హీరోయిన్గా సినిమాలు చేశారు. ఇటీవల నాని హీరోగా నటించిన ‘హాయ్ నాన్న’ చిత్రంలో ఓ మోడల్‌గా గెస్ట్ రోల్ చేశారు నేహా. ఆమె దర్శకురాలిగా పరిచయం కానున్నారని టాక్. 1945 నేపథ్యంలో సాగే ఈ చిత్రంలో సిద్ధాంత్ చతుర్వేది హీరోగా నటిస్తారని, మోహిత్ కీలకపాత్రలో నటించనున్నారని సమాచారం. అంతేకాదు... ఈ సినిమాను అజయ్ దేవగన్ నిర్మించనున్నారని టాక్. వచ్చే ఏడాది ఈ సినిమా విడుదల కానుందని తెలిసింది. ఇక తెరపైకి కూడా...ఇప్పటివరకూ తెరవెనక టెక్నీషియన్లుగా తమ ప్రతిభ చాటుకున్న సాంకేతిక నిపుణులు కొందరు ఇప్పుడు తెరపై నటులుగా కనిపించడానికి రెడీ అయ్యారు. వీరిలో కొందరు ఇంతకుముందు ఒకట్రెండు కీలక పాత్రల్లో కనిపించారు. ఇప్పుడు మాత్రం హీరోలుగా కొందరు, లెంగ్తీ రోల్స్‌లో కొందరు కనిపించనున్నారు. ఆ విశేషాలు...– ముసిమి శివాంజనేయులు -
నా కాబోయే భర్త అలా చెప్పే ఛాన్సే లేదు: వరలక్ష్మీ శరత్ కుమార్
ఒక సినిమాలో నటి వరలక్ష్మీ శరత్ కుమార్ ఉన్నారంటే చాలు ఆ సినిమాపై అంచనాలు భారీగానే ఉంటాయి. సినిమా కూడా చూడొచ్చు అనే ఆలోచన ప్రేక్షకుల్లో ఉంటుంది. దీనంతటికి ప్రధాన కారణం వైవిధ్య కథలను ఎంచుకుంటూ తనదైన శైలిలో నటిస్తూ ఆమె చాలా హిట్లు అందుకున్నారు. ఈ వరుసలో క్రాక్, నాంది, యశోద, వీర సింహా రెడ్డి, కోట బొమ్మాళి పీ.ఎస్, హను మాన్ వంటి చిత్రాలన్నీ మంచి విజయాన్ని అందుకున్నాయి. ఈ సినిమాలన్నింటిలో ఆమె మెయిన్ లీడ్‌గా కనిపిస్తుంది. తాజాగా శబరి చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు ఆమె సిద్ధంగా ఉన్నారు. మే 3న ఈ సినిమా విడుదల కానుంది. ఈ చిత్రాన్ని మహర్షి కూండ్ల సమర్పణలో మహా మూవీస్ పతాకంపై మహేంద్రనాథ్ కూండ్ల నిర్మించారు. అనిల్ కాట్జ్ దర్శకుడు. తెలుగుతో పాటు తమిళ, మలయాళ, హిందీ, కన్నడ భాషల్లో విడుదల కానున్న సందర్భంగా వరలక్ష్మీ శరత్ కుమార్ తెలుగు మీడియాతో ముచ్చటించారు. ఆ ఇంటర్వ్యూ విశేషాలు...'శబరి' ప్రయాణం ఎలా, ఎప్పుడు మొదలైంది? 'క్రాక్'కు సంతకం చేయడానికి ముందు 'శబరి' కథ విన్నా. నాకు బాగా నచ్చింది. కథపై నమ్మకంతో ఈ సినిమా చేస్తానని చెప్పాను. అయితే, షూటింగ్ చాలా రోజుల తర్వాత స్టార్ట్ చేశా. టిపికల్ రెగ్యులర్ నెగిటివ్ షేడ్ రోల్ కాకుండా కొత్త పాత్ర చేశా. ఆర్టిస్టుగా నేను ఈ పాత్ర చేయగలనని దర్శక నిర్మాతలు నమ్మారు. ఫిమేల్ ఓరియెంటెడ్ సినిమా చేయడానికి వాళ్లు ముందుకు వచ్చారు. అందుకు వాళ్లను మెచ్చుకోవాలి. ఖర్చు విషయంలో నిర్మాత రాజీ పడకుండా సినిమా తీశారు. ఇదొక సైకలాజికల్ థ్రిల్లర్. అందరికీ నచ్చుతుంది. దర్శక నిర్మాతలు కొత్తవాళ్లు... ఈ సినిమా చేయడం రిస్క్ అనిపించలేదా?లైఫే రిస్క్ అండీ. హిట్టూ ఫ్లాపులను ఎవరూ జడ్జ్ చేయలేరు. 'హనుమాన్' చిన్న సినిమా అనుకున్నారు. పెద్ద హిట్ అయ్యింది. 'నాంది', 'కోట బొమ్మాళీ పీఎస్' సినిమాలు అంత మంచి విజయాలు సాధిస్తాయని ఊహించలేదు. మేం ఒక డిఫరెంట్ సినిమా చేశాం. ప్రేక్షకులకు నచ్చుతుందనే నమ్మకం ఉంది. కొత్త నిర్మాతలు ఇండస్ట్రీలోకి వచ్చినప్పుడు కొన్ని భయాలు ఉంటాయి. నిర్మాత మహేంద్రనాథ్ కూండ్ల మీకు ఎలాంటి నమ్మకాన్ని కలిగించారు? 'శబరి' ప్రెస్‌మీట్ చూస్తే అందరూ నిర్మాత గురించి మాట్లాడారు. ఎందుకంటే... ఆయన జెన్యూన్ పర్సన్. ఎవరినీ చీట్ చేసే మెంటాలిటీ లేదు. అడగక ముందు పేమెంట్ వస్తుంది. బడ్జెట్ దాటినా మధ్యలో వదలకుండా సినిమా పూర్తి చేశారు.గణేష్ వెంకట్రామన్ సినిమాలో మీకు అపోజిట్ క్యారెక్టర్ చేశారా? మీ మధ్య యాక్షన్ సీన్లు ఉన్నాయా? సినిమాలో చూడండి. స్క్రీన్ ప్లే డ్రివెన్ సినిమా 'శబరి'. ప్రేక్షకులకు కొత్త థ్రిల్ ఇస్తుంది. డిఫరెంట్ యాక్షన్ ఉంటుంది. నేచురల్ ఫైట్ సీక్వెన్సులు ఉంటాయి. యాంగ్రీ విమన్ రోల్స్, హీరోతో ప్యారలల్ రోల్స్ చేస్తున్నారు. ఈ సమయంలో తల్లి పాత్ర అంటే ఎలా ఫీలయ్యారు? నా తొలి సినిమా 'పొడా పొడి'లో మదర్ రోల్ చేశా. 'పందెం కోడి 2'లో చేశా. నేను ఓ యాక్టర్. నచ్చిన క్యారెక్టర్ వచ్చినప్పుడు చేస్తాను. ఇమేజ్ వంటివి పట్టించుకోను. సినిమాలో ప్రేక్షకులకు ఏం చూపిస్తే అది యాక్సెప్ట్ చేస్తారు. కంటెంట్ బావుంటే ప్రేక్షకులు సినిమా చూస్తారు. 'శబరి' సినిమాలో మీ రోల్ ఏమిటి? ఛాలెంజింగ్ అనిపించిన మూమెంట్? యాంగ్రీ యంగ్ లేడీ కాదు. ఓ సాధారణ అమ్మాయి. భర్తతో సమస్యల కారణంగా, అతని నుంచి వేరుపడి కుమార్తెను ఒంటరిగా పెంచుతుంది. ఆమెకు ఏమైంది? అనేది కథ. సెటిల్డ్ పెర్ఫార్మన్స్ చేసే అవకాశం లభించింది. లౌడ్ మూమెంట్స్ ఉండవు. కుమార్తెను కాపాడుకునేటప్పుడు తల్లికి వచ్చే కోపం వేరు, సాధారణంగా వచ్చే కోపం వేరు. డిఫరెంట్ యాంగర్ చూపించే అవకాశం వచ్చింది. మదర్ అండ్ డాటర్ కనెక్షన్ మూవీలో హైలైట్ అవుతుంది. కూతుర్ని కాపాడుకోవడం కోసం తల్లి ఏం చేసిందనేది కథ. మెయిన్ లీడ్ చేసేటప్పుడు ప్రెజర్ ఏమైనా ఉంటుందా? హిట్టూ ఫ్లాపులు నా చేతుల్లో లేవు. ప్రేక్షకులు నన్ను ఆదరిస్తున్నారు. వాళ్లకు మంచి సినిమాలు ఇవ్వాలనే ప్రెజర్ ఉంది. ప్రేక్షకులు నచ్చే విధమైన నటన ఇవ్వాలనే ప్రెజర్ ఉంది. థియేటర్ నుంచి బయటకు వచ్చే ప్రేక్షకుడు ఆమె పెర్ఫార్మన్స్ బాలేదని అనుకోకూడదు.నిర్మాతకు మరో సినిమా చేస్తానని మాటిచ్చారట! చేస్తాను. మంచి కథతో వస్తే తప్పకుండా చేస్తా.మీ సినిమాల గురించి కాబోయే భర్త నికోలయ్ ఏం చెబుతారు? బాలేదంటే బాలేదని చెబుతారు. బావుందంటే బావుందని చెబుతారు. ఆయనకు బాలేదని చెప్పే అవకాశం లేదు (నవ్వులు). ఇప్పటి వరకు బావుందని చెప్పారు. పెళ్లి ఎప్పుడు?ఈ ఏడాది ఉంటుంది. నెక్స్ట్ సినిమాలు?'కూర్మ నాయకి' సినిమా విడుదలకు సిద్ధమైంది. తమిళంలో ధనుష్ గారి సినిమాతో పాటు మరో సినిమా చేస్తున్నా. కన్నడలో సుదీప్ గారి 'మ్యాక్స్' చేశా. మరో రెండు మూడు సినిమాలు చర్చల దశలో ఉన్నాయి. కన్ఫర్మ్ అయ్యాక ఆ వివరాలు చెబుతా. -
వరలక్ష్మి శరత్ కుమార్ ‘వర ఐపీఎస్’ ఫస్ట్‌లుక్ విడుదల
క్రాక్, నాంది వంటి సూపర్ హిట్ చిత్రాల్లో నటించి తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుంది నటి వరలక్ష్మి శరత్ కుమార్. లేడీ ప్రధానమైన పాత్రలు ఉన్న సినిమాలకు కేరాఫ్ అడ్రస్ గా నిలుస్తున్న ఆమె నటిస్తున్న తాజా చిత్రం ‘వర ఐపీఎస్’. ఉగాది పండుగను పురస్కరించుకుని ఈ సినిమా ఫస్ట్‌లుక్‌ను ఈ రోజు విడుదల చేసింది చిత్ర బృందం. శ్రీ లలితాంబికా ప్రొడక్షన్ నిర్మిస్తున్నఈ సినిమా తెలుగు హక్కులను శ్రీలక్ష్మి జ్యోతి బ్యానర్ వారు దక్కించుకున్నారు. శ్రీ లక్ష్మి జ్యోతి బ్యానర్ అధినేత ఏ ఎన్ బాలాజీ ఈ చిత్రాన్ని తెలుగులో ఎంతో ప్రతిష్టాత్మకంగా విడుదల చేస్తుండగా.. నేడు(ఏప్రిల్ 3) ఫస్ట్‌లుక్ పోస్టర్ విడుదల చేశారు. సినిమాలో నటిస్తున్న ప్రధాన పాత్రలతో రూపొందించిన ఈ పోస్టర్.. సినిమాపై అంచనాలను పెంచింది. ఒరేయ్ బామ్మర్ది వంటి విజయవంతమైన సినిమాలు విడుదల చేసిన ఈ సంస్థ నుంచి మరో ఆసక్తి పరిచే సినిమా రావడం విశేషం. ఇందులో వరలక్ష్మి శరత్ కుమార్ పవర్ఫుల్ ఐపీఎస్ పాత్రలో నటిస్తున్న ఈ సినిమాకి జగదీష్ కుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. కేజీఎఫ్ లాంటి భారీ సినిమాకి సంగీతం అందించిన రవి బస్రూర్ సంగీతం సమకూరుస్తున్నారు. ఇందులో తలైవసల్ విజయ్, రవి కాలే, సుమిత్ర, భరత్ రెడ్డి, బ్లాక్ పాండి, రాజేష్ తదితరులు నటిస్తున్నారు. -
'శక్తి'గా వస్తున్న స్టార్ వారసురాలు
కోలీవుడ్ సీనియర్ నటుడు శరత్ కుమార్ వారసురాలిగా వెండితెరకు పరిచయం అయిన నటి వరలక్ష్మీ శరత్ కుమార్. కోలీవుడ్ లో గ్లామర్ హీరోయిన్ గా సత్తా చాటిన ఈ భామ ఇప్పుడు నటనకు ఆస్కారం ఉన్న పాత్రల మీద దృష్టి పెట్టింది. విశాల్ తో ప్రేమాయణం నేపథ్యంలో తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితమైన ఈ భామ త్వరలో ఓ తెలుగు సినిమాతో ఆడియన్స్ ముందుకు రానుంది. శక్తి పేరుతో తెరకెక్కుతున్న ఈ మూడు భాషల్లో తెరకెక్కుతున్న ఈ సినిమా తెలుగు ఫస్ట్ లుక్ పోస్టర్ ను టాలీవుడ్ హీరో రానా రిలీజ్ చేశాడు. ప్రియదర్శిని దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో వరలక్ష్మీ శరత్ కుమార్ పూర్తి డిఫరెంట్ మేకోవర్ లో దర్శనమిస్తోంది. #shakthivaru good luck my friend!! @varusarath@sharanyalouis@priyadhaarshini@papertalestory pic.twitter.com/vtprTtMcSe — Rana Daggubati (@RanaDaggubati) 5 October 2017 -
వేకువజాము వరకూ ఎంజాయ్
డిసెంబర్ 31 వస్తుందంటేనే యువతలో సందడి వాతావరణం ఉరకలేస్తుంది. ఆ రోజు రాత్రిని ఒక మరపురాని విధంగా ఫుల్ జోష్‌లో ఎంజాయ్ చేయడానికి పిల్లల నుంచి పెద్దల వరకూ సిద్ధం అయిపోతారు. అందుకు ముందుగానే ప్రణాళికలను రెడీ చేసుకుంటారు. గతేడాదికి గుడ్‌బై చెబుతూ, నూతన సంవత్సరానికి వెల్కమ్ పలికే విధంగా ఎంతో ఉత్సాహంగా, ఉల్లాసంగా గడిపేస్తారు. ఇక ఆ రాత్రి పబ్‌లు, ఫాం హౌస్‌లు, నక్షత్ర హోటళ్లు అందంగా ముస్తాబై యువత వినోదాలకు వేదికగా నిలుస్తాయి. అదే విధంగా శనివారం కూడా యువత విందులు, వినోదాలతో మునిగి పోయారు. అలాంటి వారి ఎంజాయ్‌మెంట్‌కు పెద్ద నోట్ల రద్దు కూడా అడ్డురాలేదు. నక్షత్ర హోటళ్లలో నీలిరంగు కాంతుల్లో ఆట పాటలతో ఓలలాడి యువత ఫుల్ ఖుషీ అయ్యారు. ఇక నటి వరలక్ష్మీ శరత్‌కుమార్ తన స్నేహితులతో తెల్లవారే వరకూ ఎంజాయ్ చేస్తూ గడిపారు. ఆ వీడియోను సోషల్‌మీడియాలో విడుదల చేశారు. అదిప్పుడు అన్ని వెబ్సైట్లలో హల్చల్ చేస్తోంది. వరలక్ష్మీ, నటుడు విశాల్‌ల మధ్య ప్రేమాయణం నడుస్తోందనే ప్రచారం మొన్నటి వరకూ సాగింది. ఇటీవల వారి ప్రేమకు బ్రేక్అప్ అయ్యిందనే ప్రచారం హల్చల్ చేసింది. అయితే అంతకుముందు వరకూ పెద్దగా బహిరంగంగా పార్టీల్లో కనిపించని నటి వరలక్ష్మీ ఇటీవల ఎక్కువగా కనిపిస్తున్నారని కోలీవుడ్ వర్గాలు చెవులు కొరుక్కుంటున్నారు. కాగా నటి త్రిష అయితే 30వ తేదీ రాత్రి నుంచే తన స్నేహితులతో పార్టీలు చేసుకుంటూ యమాగా ఎంజాయ్ చేస్తున్నారు. ఇలాగే మరి కొందరు తారామణులు డిసెంబర్ 31 రాత్రిని ఫుల్‌గా ఎంజాయ్ చేశారు.


