బన్నీ కెరీర్లో రెండో సారి..! | Vakkantham Vamsi with Allu Arjun | Sakshi
Sakshi News home page

బన్నీ కెరీర్లో రెండో సారి..!

Sep 28 2016 2:43 PM | Updated on Sep 4 2017 3:24 PM

బన్నీ కెరీర్లో రెండో సారి..!

బన్నీ కెరీర్లో రెండో సారి..!

తన కెరీర్లో ఇప్పటి వరకు పదహారు సినిమాల్లో నటించిన యంగ్ హీరో అల్లు అర్జున్ కేవలం ఒక్క సినిమాను మాత్రమే కొత్త దర్శకుడితో కలిసి చేశాడు. కెరీర్ స్టార్టింగ్ లోనే సుకుమార్ను దర్శకుడిగా పరిచయం చేస్తూ...

తన కెరీర్లో ఇప్పటి వరకు పదహారు సినిమాల్లో నటించిన యంగ్ హీరో అల్లు అర్జున్ కేవలం ఒక్క సినిమాను మాత్రమే కొత్త దర్శకుడితో కలిసి చేశాడు. కెరీర్ స్టార్టింగ్ లోనే సుకుమార్ను దర్శకుడిగా పరిచయం చేస్తూ ఆర్య సినిమా చేసి అల్లు అర్జున్, ఆ తరువాత ఇంత వరకు ఒక్క కొత్త దర్శకుడితో కూడా సినిమా చేయలేదు.

అయితే ఇన్నేళ్ల తరువాత మరోసారి ఓ డెబ్యూ డైరెక్టర్తో సినిమాకు రెడీ అవుతున్నాడు బన్నీ. ప్రముఖ కథా రచయిత వక్కంతం వంశీ, దర్శకుడిగా మారి తెరకెక్కించనున్న సినిమాలో అల్లు అర్జున్ హీరోగా నటించేందుకు అంగీకరించాడు. ఇప్పటికే హరీష్ శంకర్ దర్శకత్వంలో డిజె దువ్వాడ జగన్నాథమ్, తమిళ దర్శకుడు లింగుసామితో మరో సినిమాను ప్రారంభించిన బన్నీ ఈ రెండు సినిమాలు పూర్తయిన తరువాత వంశీ దర్శకత్వంలో సినిమాను ప్రారంభించేలా ప్లాన్ చేసుకుంటున్నాడు.

Advertisement
 
Advertisement
Advertisement