నవ్వులు పంచే దొంగ | vajra kavacha dhara govinda first look release | Sakshi
Sakshi News home page

నవ్వులు పంచే దొంగ

Jan 28 2019 5:05 AM | Updated on Jan 28 2019 5:05 AM

vajra kavacha dhara govinda first look release - Sakshi

సప్తగిరి

అతని పేరు గోవిందు. పేరుకి ఫన్నీ దొంగ అయినా అతనికో లక్ష్యం ఉంటుంది. ఆ లక్ష్య సాధన కోసం ఏం చేశాడనే కథతో రూపొందుతోన్న చిత్రం ‘వజ్ర కవచధర గోవింద’. సప్తగిరి, వైభవీ జోషీ జంటగా అరుణ్‌ పవార్‌ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రమిది. శివ శివమ్‌ ఫిలిమ్స్‌ పతాకంపై నరేంద్ర యెడల, జీవీఎన్‌ రెడ్డి నిర్మిస్తున్న ఈ సినిమా ఫస్ట్‌ లుక్‌ని విడుదల చేశారు. అరుణ్‌ పవార్‌ మాట్లాడుతూ–‘‘సప్తగిరితో నేను తెరకెక్కించిన ‘సప్తగిరి ఎక్స్‌ప్రెస్‌’ ఎంత పెద్ద విజయం సాధించిందో తెలిసిందే.

తాజాగా రూపొందిస్తున్న ‘వజ్ర కవచధర గోవింద’ సినిమా అంతకు మించి సక్సెస్‌ కావాలనే తపనతో కృషి చేస్తున్నాం. కడుపుబ్బా నవ్వించే అంశాలతోపాటు, మంచి యాక్షన్, ఎమోషన్, ఇతర వాణిజ్య అంశాలు మెండుగా ఉంటాయి. మా నిర్మాతలు కొత్తవారైనా ఎక్కడా కాంప్రమైజ్‌ కావడం లేదు’’ అన్నారు. ‘‘హిలేరియస్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ చిత్రమిది. 80 శాతం షూటింగ్‌ పూర్తయింది. మిగిలిన సన్నివేశాలను కర్ణాటకలోని ఒక గుడిలో తెరకెక్కిస్తాం’’ అని నరేంద్ర యెడల, జీవీఎన్‌ రెడ్డి అన్నారు. ఈ చిత్రానికి కథ: జిటిఆర్‌ మహేంద్ర, సంగీతం: విజయ్‌ బుల్గానిన్, కెమెరా: ప్రవీణ్‌ వనమాలి, ఎడిటింగ్‌: కిషోర్‌ మద్దాలి, ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌: సలాన బాలగోపాలరావు.

Advertisement
 
Advertisement
Advertisement