... ప్లస్‌ కౌంటింగ్‌! | Vaishakham movie is going to be released soon. | Sakshi
Sakshi News home page

... ప్లస్‌ కౌంటింగ్‌!

Jun 27 2017 12:37 AM | Updated on Sep 5 2017 2:31 PM

... ప్లస్‌ కౌంటింగ్‌!

... ప్లస్‌ కౌంటింగ్‌!

హరీశ్, అవంతిక... తెలుగు తెరకు ఈ హీరో హీరోయిన్లు ఇద్దరూ కొత్తే.

హరీశ్, అవంతిక... తెలుగు తెరకు ఈ హీరో హీరోయిన్లు ఇద్దరూ కొత్తే. కానీ, వీళ్లిద్దరూ జంటగా నటించిన ‘వైశాఖం’ థీమ్‌ టీజర్‌ను యూట్యూబ్‌లో 30 లక్షల మంది చూశారు! రోజు రోజుకీ వ్యూస్‌ కౌంట్‌ పెరుగుతోంది కూడా.


‘చంటిగాడు, ప్రేమికుడు, లవ్‌లీ’ వంటి హిట్‌ సినిమాలు తీసిన బి. జయ ఈ సినిమాకు దర్శకురాలు కావడంతో కొత్త వాళ్లతో తీసిన ఈ సినిమాపై ప్రేక్షకులు బాగా  ఇంట్రెస్ట్‌ చూపిస్తున్నారు. ఆర్‌.జె. సినిమాస్‌పై బీఏ రాజు నిర్మించిన ఈ ‘వైశాఖం’ను త్వరలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చే కథతో ఈ సినిమాను రూపొందించామని బీఏ రాజు తెలిపారు. రోజు రోజుకీ తగ్గుతున్న కుటుంబ విలువలు, అనుబంధాలకు ప్రతిబింబంగా ఈ సినిమా ఉంటుందన్నారు దర్శకురాలు. ఈ చిత్రానికి లైన్‌ ప్రొడ్యూసర్‌: బి. శివకుమార్‌.

Advertisement
 
Advertisement
Advertisement