ఏక్‌ దీపిక దోసె పార్సిల్‌

U.S. Restaurant Names A Dish After Deepika Padukone - Sakshi

అమెరికాలో టెక్సాస్‌ ప్రాంతంలోని దోసె ల్యాబ్స్‌ దగ్గర వేరే ఏ దోసె అడిగినా ఆర్డర్‌ కొంచెం ఆలస్యం అవ్వచ్చేమో కానీ.. అదే ‘దీపికా పదుకోన్‌ దోసె’ అనగానే ఆలూ, చిల్లీతో నిండిన వేడి వేడి మసాలా దోసె మన ముందుకొస్తుంది. సినిమా స్టార్ల పేర్లు నచ్చిన వాటికి పెట్టడం చాలాసార్లే విన్నాం.. చూశాం. తాజాగా టెక్సాస్‌లో ‘దోశ ల్యాబ్స్‌’ అనే స్ట్రీట్‌ఫుడ్‌ రెస్టారెంట్‌లో ఓ దోసెకు దీపికా పదుకోన్‌ పేరును పెట్టుకున్నారు హోటల్‌ యాజమాన్యం.

ట్వీటర్‌లో ఈ విషయాన్ని చూసిన దీపిక ‘ఎవరెవరికి ఆకలిగా ఉందోచ్‌..’ అంటూ తన ట్వీటర్‌లో ఈ విషయాన్ని వడ్డించారు. ‘‘కొత్త సంవత్సరం ఇంతకన్నా గొప్పగా ప్రారంభం అవ్వదనుకుంటా. అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు’’ అని ట్వీట్‌ చేశారామె.  వెంటనే ‘‘మేడమ్‌ నార్త్‌ ఇండియాలో (పూణే) దీపికా పదుకోన్‌ పరాతా ఫుల్‌ ఫేమస్‌ అంటూ మరో హోటల్‌ సర్వ్‌ చేసే మెనూ పిక్‌ పోస్ట్‌ చేస్తూ రిప్లై చేశారో నెటిజన్‌. ‘‘నేనా హోటల్‌కి వెళ్తే కచ్చితంగా ‘దీపికా పదుకోన్‌ దోసె ఆర్డర్‌ ఇచ్చేవాణ్ణి’’ అని సరదాగా పేర్కొన్నారు దీపికా భర్త రణ్‌వీర్‌ సింగ్‌.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top