
సాక్షి, సినిమా : ఓవైపు రంగస్థలం షూటింగ్‌లో పాల్గొంటు బిజీగా ఉన్న మెగాపవర్ స్టార్ రామ్‌చరణ్.. మరోవైపు తన తర్వాతి చిత్రం సైరా కోసం సిద్ధమౌతున్న మెగాస్టార్ చిరంజీవి. తండ్రి-తనయులిద్దరికీ కలిసేందుకు క్షణం తీరిక లేకుండా పోయింది. దీంతో ఎలాగోలా చిరును ఒప్పించి చెర్రీ ఇలా కాఫీ కోసం బయటకు వచ్చాడంట.
‘‘నేను, నాన్న సేమ్ టు సేమ్. ఇద్దరం గడ్డం లుక్ లోనే, ఇది మాకు కాఫీ టైమ్. నాన్నగారితో ఆనందంగా ఇలా బయటికి వచ్చి కాఫీ త్రాగడం కోసం ఒప్పించాను..’’ అంటూ చెర్రీ ఈ ఫొటోని పోస్ట్ చేశాడు. ఇక ఈ ఫోటో చూసిన చెర్రీ వైఫ్ ఉపాసన ఓ ఆసక్తికర కామెంట్ పెట్టింది.
'తల్లిదండ్రులతో ఇలా ఎక్కువ సమయం గడపడం చాలా ముఖ్యమైన విషయం. తండ్రీ కొడుకుల మధ్య ఇది వెలకట్టలేని ఓ అమూల్యమైన బహుమతి. సినిమాల్లో తండ్రి ఎలాగ దూసుకెళ్తున్నాడో.. కొడుకు రామ్ చరణ్ కూడా అలాగే దూసుకెళ్తున్నాడు..' అంటూ ఉపాసన కామెంట్ చేసింది. తండ్రీ కొడుకుల రేర్ మూమెంట్‌పై ఉపాసన చేసిన ఈ కామెంట్ ఇప్పుడు వైరల్ అవుతోంది.