నెట్లో రజనీ ఇంట్రడక్షన్ సీన్..? | Two-minute scene of Kabali leaked | Sakshi
Sakshi News home page

నెట్లో రజనీ ఇంట్రడక్షన్ సీన్..?

Jul 21 2016 8:35 AM | Updated on Sep 4 2017 5:41 AM

నెట్లో రజనీ ఇంట్రడక్షన్ సీన్..?

నెట్లో రజనీ ఇంట్రడక్షన్ సీన్..?

కొద్ది రోజులుగా కబాలి సినిమా లీక్ అయ్యిందంటూ వార్తలు వినిపిస్తున్నాయి. ఎక్కడ సినిమాకు సంబందించిన లింక్స్ కనిపించకపోయినా., సినిమా లీక్ అయ్యిందంటూ పెద్ద హడావిడే జరిగింది. చిత్ర నిర్మాతలు సైతం...

కొద్ది రోజులుగా కబాలి సినిమా లీక్ అయ్యిందంటూ వార్తలు వినిపిస్తున్నాయి. ఎక్కడ సినిమాకు సంబందించిన లింక్స్ కనిపించకపోయినా., సినిమా లీక్ అయ్యిందంటూ పెద్ద హడావిడే జరిగింది. చిత్ర నిర్మాతలు సైతం, పోలీస్ శాఖను సంప్రదించిన పైరసీని అరికట్టాలని కోరారు. 250కి పైగా పైరసీ సైట్లపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశారు. చివరకు సినిమా లీక్ అవ్వలేదంటూ ట్విస్ట్ ఇచ్చి అంతా తూచ్ అనేశారు.

తాజాగా మరోసారి కబాలిలో రజనీ ఇంట్రడక్షన్ సీన్ లీక్ అయ్యిందంటూ వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే విదేశాలకు ప్రింట్స్ చేరుకోవటంతో అక్కడే సినిమా లీక్ అయ్యిందన్న ప్రచారం జరుగుతోంది. లీక్ అయిన సీన్లో అరబిక్ సబ్ టైటిల్స్ ఉండటంతో ఈ సీన్ గల్ఫ్ దేశాల్లో లీక్ అయ్యిందన్న అనుమానం వ్యక్తం అవుతోంది. రజనీ జైలు నుంచి బయటకు వస్తున్న రెండు నిమిషాల సన్నివేశం లీక్ అయ్యిందన్న ప్రచారం జరుగుతోంది.

Advertisement
 
Advertisement
Advertisement