స్వచ్ఛమైన ప్రేమ | Two Friends Pre Release | Sakshi
Sakshi News home page

స్వచ్ఛమైన ప్రేమ

Oct 25 2018 12:41 AM | Updated on Oct 25 2018 12:41 AM

Two Friends Pre Release - Sakshi

‘‘టు ఫ్రెండ్స్‌’ హీరో కార్తీక్‌ కోసం ఈ వేడుకకు వచ్చా. అతనికి ఉజ్వల భవిష్యత్తు ఉండాలి. రైతు కుటుంబం నుంచి సినిమాల్లోకి వచ్చిన అనంతరాముడు అగ్ర నిర్మాతగా ఎదగాలి’’ అని హీరో శ్రీకాంత్‌ అన్నారు. సూరజ్, అఖిల్‌ కార్తీక్‌ హీరోలుగా, సోనియా, ఫర హీరోయిన్లుగా శ్రీనివాస్‌ జి.ఎల్‌.బి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘టు ఫ్రెండ్స్‌’. ట్రూ లవ్‌ ఉపశీర్షిక.

ముళ్లగూరు లక్ష్మీదేవి సమర్పణలో ముళ్లగూరు అనంతరాముడు, ముళ్లగూరు రమేష్‌ నాయుడు నిర్మించిన ఈ సినిమా రేపు రిలీజవుతోంది. ఈ చిత్రం ప్రీ రిలీజ్‌ వేడుకలో అనంతరాముడు మాట్లాడుతూ– ‘‘ఈ చిత్రం నిర్మాణంలో కొన్ని చేదు అనుభవాలు ఎదురయ్యాయి. సినిమా బాగా రావడం వల్ల వాటిని అనుభవ పాఠాలుగా తీసుకున్నా. తెలుగు, కన్నడ భాషల్లో రూపొందిన ఈ చిత్రాన్ని కన్నడంలో రిలీజ్‌ చేయగా, మంచి వసూళ్లు సాధించింది’’ అన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement