రాజమండ్రికి జగదీష్‌ | Tuck Jagadish Movie Shooting in Rajahmundry | Sakshi
Sakshi News home page

రాజమండ్రికి జగదీష్‌

Mar 12 2020 12:22 AM | Updated on Mar 12 2020 12:22 AM

Tuck Jagadish Movie Shooting in Rajahmundry - Sakshi

నాని

పొల్లాచ్చి నుంచి రాజమండ్రికి మకాం మార్చారు హీరో నాని. ‘నిన్ను కోరి’ వంటి హిట్‌ మూవీ తర్వాత హీరో నాని, డైరెక్టర్‌ శివ నిర్వాణ కాంబినేషన్‌లో రూపుదిద్దుకుంటున్న చిత్రం ‘టక్‌ జగదీష్‌’. ఇందులో రీతూ వర్మ, ఐశ్వర్యారాజేష్‌ కథానాయికలుగా నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని సాహు గారపాటి, హరీష్‌ పెద్ది నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్‌ రాజమండ్రి పరసర ప్రాంతాల్లో జరుగుతోంది.

‘‘పొల్లాచ్చిలో జరిగిన తొలి షెడ్యూల్‌లో నాని, రీతూ వర్మలతో పాటు కీలక తారాగణంపై కీలక సన్నివేశాలను చిత్రీకరించాం. రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో రెండో షెడ్యూల్‌ను స్టార్ట్‌ చేశాం. ఒక పాట, ఓ యాక్షన్‌ ఎపిసోడ్‌తో పాటుగా ప్రధాన తారాగణం అంతా పాల్గొనే కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తాం’’ అని చిత్రబృందం వెల్లడించింది. ఈ సినిమాకు సంగీతం: తమన్, ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌: ఎస్‌. వెంకటరత్నం. 

Advertisement
 
Advertisement
Advertisement