ఎన్టీఆర్‌ పేరుతో ఆడేసుకుంటున్నారు..! | TTT Which Is Similar To RRR Is Now Trending On The Internet | Sakshi
Sakshi News home page

Mar 27 2018 10:22 AM | Updated on Jul 14 2019 4:05 PM

TTT Which Is Similar To RRR Is Now Trending On The Internet - Sakshi

నందమూరి వారసుడిగా వెండితెరకు పరిచయం అయిన ఎన్టీఆర్‌... తాతకు తగ్గ మనవడిగా వెండితెర మీద సత్తా చాటుతున్నాడు. కెరీర్‌ స్టార్టింగ్ నుంచి ఎన్టీఆర్‌ తన పేరును నందమూరి తారక రామారావుగానే తెర మీద వేసుకుంటూ వస్తున్నాడు. అయితే తాజాగా రాజమౌళి సినిమా కోసం మాత్రం ఎన్టీఆర్‌ పేరును రామారావు అని మాత్రమే వేశారు. రాజమౌళి, రామ్‌చరణ్‌ల పేరుతో రైమింగ్‌ కలిసేలా ఎన్టీఆర్‌ పేరును రామారావు అని వేశారు. ముగ్గురి పేర్లు కలిసేలా ఆర్‌ఆర్‌ఆర్‌ (#RRR) అనే హ్యాష్ ట్యాగ్‌ను ట్రెండ్‌ చేశారు.

తాజాగా మరో సినిమా కోసం ఎన్టీఆర్‌ పేరును కట్ చేసి వాడేస్తున్నారు. ఎన్టీఆర్‌ను సన్నిహితులు తారక్‌ అని పిలుస్తుంటారు. అందుకే త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ దర్శకత్వంలో తెరకెక్కబోయే సినిమా కోసం ఎన్టీఆర్ పేరు తారక్‌ అని వాడేస్తున్నారు. రాజమౌళి సినిమా తరహాలో టీటీటీ (#TTT) అనే హ్యాష్ ట్యాగ్‌ను ట్రెండ్‌ చేస్తున్నాడు. దర్శకుడు త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌, సంగీత దర్శకుడు తమన్‌ల పేర్లతో కలిసేలా ఎన్టీఆర్‌ పేరు తారక్‌ అని వేశారు. మ్యూజిక్‌ సిట్టింగ్స్‌ ప్రారంభమైన విషయాన్ని తెలియజేస్తూ టీటీటీ అంటూ ట్వీట్ చేశాడు.

Advertisement
 
Advertisement
Advertisement