నిర్మాతగానూ బిజీ అవుతున్నాడు | Trivikram Srinivas turns producer | Sakshi
Sakshi News home page

నిర్మాతగానూ బిజీ అవుతున్నాడు

Oct 15 2016 12:09 PM | Updated on Sep 4 2017 5:19 PM

నిర్మాతగానూ బిజీ అవుతున్నాడు

నిర్మాతగానూ బిజీ అవుతున్నాడు

మాటల రచయితగా ఎంట్రీ ఇచ్చి తరువాత స్టార్ డైరెక్టర్‌గా ఎదిగిన దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్. స్టార్ హీరోలతో బ్లాక్ బస్టర్ హిట్స్ అందుకున్న త్రివిక్రమ్ ఇప్పుడు నిర్మాణ రంగం మీద దృష్టిపెడుతున్నాడు. ఇప్పటికే త్రివిక్రమ్ తో...

మాటల రచయితగా ఎంట్రీ ఇచ్చి తరువాత స్టార్ డైరెక్టర్‌గా ఎదిగిన దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్. స్టార్ హీరోలతో బ్లాక్ బస్టర్ హిట్స్ అందుకున్న త్రివిక్రమ్ ఇప్పుడు నిర్మాణ రంగం మీద దృష్టిపెడుతున్నాడు. ఇప్పటికే త్రివిక్రమ్ తో సినిమాలను వరుసగా నిర్మిస్తున్న హారికా అండ్ హాసినీ క్రియేషన్స్ బ్యానర్‌లో త్రివిక్రమ్ భాగస్వామి అన్న టాక్ బలంగా వినిపిస్తోంది. అయితే త్వరలోనే త్రివిక్రమ్ తన సొంతం నిర్మాణ సంస్థను ఏర్పాటు చేసి వరుసగా సినిమాలు నిర్మించేందుకు ప్లాన్ చేసుకుంటున్నాడు.

త్రివిక్రమ్ నిర్మాతగా నందినీ రెడ్డి దర్శకత్వంలో విజయ్ దేవర కొండ హీరోగా ఓ సినిమాను రూపొందించేందుకు రెడీ అవుతున్నారు. ఈ సినిమాతో పాటు మరో రెండు సినిమాలను కూడా లైన్‌లో పెడుతున్నాడు. రౌడీ ఫెలో సినిమాతో దర్శకుడిగా మారిన కృష్ణచైతన్య డైరెక్షన్‌లో నితిన్ హీరోగా సినిమాను నిర్మిస్తున్నాడు. అదే సమయంలో అవసరాల శ్రీనివాస్‌తోనూ ఓ సినిమాను నిర్మించేందుకు ప్లాన్ చేస్తున్నాడు. ఈ మూడు సినిమాలతో దర్శకుడిగానే కాదు నిర్మాతగానూ సత్తా చాటాలని భావిస్తున్నాడు త్రివిక్రమ్ శ్రీనివాస్.

Advertisement
 
Advertisement
Advertisement