పుట్టిన రోజున అభిమానులకు త్రివిక్రమ్ కానుక | trivikram srinivas birthday gift to fans | Sakshi
Sakshi News home page

పుట్టిన రోజున అభిమానులకు త్రివిక్రమ్ కానుక

Nov 6 2016 3:24 PM | Updated on Mar 22 2019 5:33 PM

పుట్టిన రోజున అభిమానులకు త్రివిక్రమ్ కానుక - Sakshi

పుట్టిన రోజున అభిమానులకు త్రివిక్రమ్ కానుక

ప్రస్తుతం టాలీవుడ్లో టాప్ డైరెక్టర్స్ లిస్ట్లో ప్రముఖం వినిపించే పేరు త్రివిక్రమ్ శ్రీనివాస్. తన మాటలతోనే సినిమాలకు బ్లాక్ బస్టర్ సక్సెస్లను అందించే త్రివిక్రమ్, ప్రస్తుతం పవన్ కళ్యాణ్ హీరోగా...

ప్రస్తుతం టాలీవుడ్లో టాప్ డైరెక్టర్స్ లిస్ట్లో ప్రముఖం వినిపించే పేరు త్రివిక్రమ్ శ్రీనివాస్. తన మాటలతోనే సినిమాలకు బ్లాక్ బస్టర్ సక్సెస్లను అందించే త్రివిక్రమ్, ప్రస్తుతం పవన్ కళ్యాణ్ హీరోగా తెరకెక్కించబోయే సినిమాకు సంబందించిన ప్రీ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్నాడు. ఈ సోమవారం (నవంబర్ 7) తన పుట్టిన రోజు సందర్భంగా అభిమానులకు గిఫ్ట్ ఇవ్వనున్నాడు త్రివిక్రమ్.

ఇప్పటికే సోషల్ మీడియాలో త్రివిక్రమ్ శ్రీనివాస్కు భారీ ఫాలోయింగ్ ఉంది. త్రివిక్రమ్ అఫీషియల్గా నిర్వహిస్తున్న www.trivikramcelluloid.in తో పాటు ఫేస్బుక్ లోనూ ఆయన పంచ్ డైలాగ్లకు మంచి ఫాలోయింగ్ ఉంది. అయితే తన సినిమా విశేషాల కోసం ఆసక్తిగా ఎదురుచూసే అభిమానులకు మరింత చేరువయ్యేందుకు నిర్ణయించుకున్నాడు త్రివిక్రమ్.
 
అందుకోసం ఓ మొబైల్ యాప్ను తన పుట్టిన రోజు సందర్భంగా అందుబాటులోకి తేనున్నాడు. ఈ యాప్ ద్వారా తన సినిమాకు సంబందించిన విశేషాలను అభిమానులతో పంచుకోవాలని భావిస్తున్నాడు. ఈ యాప్ నవంబర్ 7వ తారీఖు నుంచి గూగుల్ ప్లే స్టోర్లో అందుబాటులోకి రానుంది.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement