మహేష్.. వెంకీ.. త్రివిక్రమ్...? | Trivikram multi starrer with Mahesh Venkatesh | Sakshi
Sakshi News home page

Dec 16 2017 10:38 AM | Updated on Dec 16 2017 10:54 AM

Trivikram multi starrer with Mahesh Venkatesh - Sakshi

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ప్రస్తుతం పవన్ కళ్యాణ్ హీరోగా అజ్ఞాతవాసి సినిమాను తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 10న రిలీజ్ అవుతోంది. ఈ సినిమా తరువాత ఎన్టీఆర్ హీరోగా సినిమాను ప్రారంభించనున్నాడు త్రివిక్రమ్. ఇప్పటికే మహేష్, త్రివిక్రమ్ కాంబినేషన్ లో మరో సినిమా రాబోతోందని చాలా రోజులుగా ప‍్రచారం జరుగుతోంది. తాజాగా వెంకటేష్ పుట్టిన రోజు సందర్భంగా త్రివిక్రమ్ దర్శకత్వంలో సినిమా ఉంటుందని పోస్టర్ కూడా రిలీజ్ చేశారు.

ఈ కాంబినేషన్ పై టాలీవుడ్ సర్కిల్స్ లో ఆసక్తికర చర్చ జరుగుతోంది. ఎన్టీఆర్ తరువాత త్రివిక్రమ్ చేయబోయే సినిమా మల్టీ స్టారర్ అన్న ప్రచారం జరుగుతోంది. ఈ సినిమాలో వెంకటేష్, మహేష్ బాబులు హీరోలుగా నటించనున్నారట. గతంలో ఈ ఇద్దరు హీరోలుగా తెరకెక్కిన సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు ఘనవిజయం సాధించిన నేపథ్యంలో మరోసారి ఆ కాంబినేషన్ ను రిపీట్ చేసేందుకు రెడీ అవుతున‍్నారట. ఈ కాంబినేషన్ పై క్లారిటీ రావాలంటే మాత్రం అధికారిక ప్రకటన వరకు వెయిట్ చేయాల్సిందే.

Advertisement
 
Advertisement
Advertisement