మరో పదేళ్లు ఇలాగే... | Trisha to entertain another ten years! | Sakshi
Sakshi News home page

మరో పదేళ్లు ఇలాగే...

Jan 29 2014 11:32 PM | Updated on Apr 3 2019 6:23 PM

మరో పదేళ్లు ఇలాగే... - Sakshi

మరో పదేళ్లు ఇలాగే...

‘‘ప్రియా.. నువ్వు సూపర్. నిన్ను మర్చిపోవడం అంత సులువు కాదు. వీలుంటే నీ ప్రేమికుడవ్వాలని ఉంది’’ అంటూ కొంతమంది అబ్బాయిలు ఇటీవల త్రిషకు ట్విట్టర్ ద్వారా

 ‘‘ప్రియా.. నువ్వు సూపర్. నిన్ను మర్చిపోవడం అంత సులువు కాదు. వీలుంటే నీ ప్రేమికుడవ్వాలని ఉంది’’ అంటూ కొంతమంది అబ్బాయిలు ఇటీవల త్రిషకు ట్విట్టర్ ద్వారా ప్రేమ సందేశాలు పంపారు. ఇంతకీ ప్రియా ఎవరు? ఆమె గురించి త్రిషకు సందేశాలు పంపడమేంటి అనుకుంటున్నారా? తమిళ చిత్రం ‘ఎండ్రెండ్రుమ్ పున్నగై’లో త్రిష చేసిన పాత్ర పేరిది. ఈ చిత్రం ఘనవిజయం సాధించడంతో పాటు త్రిషకు చాలా మంచి పేరు తెచ్చిపెట్టింది. గత ఏడాది చివర్లో విడుదలైన ఈ సినిమా విజయపథంలో దూసుకెళుతూ త్రిషకు ఈ ఏడాది శుభారంభాన్నిచ్చింది.
 
  పదేళ్ల క్రితం సినిమాల్లోకొచ్చినప్పుడు ఎలా ఉందో ఇప్పుడూ త్రిష అలానే ఉందని కూడా చాలామంది అంటున్నారు. ఈ సినిమాలో అంత యంగ్‌గా కనిపించడంతో పాటు అద్భుతంగా నటించారామె. అసలు త్రిష వయసు పెరుగుతోందా? తరుగుతోందా? అని కూడా అనుకుంటున్నారు. ఇదే విషయాన్ని త్రిష ముందుంచితే -‘‘నా సంతోషానికి కారణం ఇలాంటి అభినందనలే. సంతోషమే సగం బలం అంటారు. ఆ బలం వల్లే నా వయసు పెరుగుతున్నా తగ్గుతున్నట్లుగా ఉందేమో. అయినా నేను సినిమాల్లోకొచ్చి పదేళ్లయ్యిందంటే నమ్మబుద్ధి కావడంలేదు. ఇప్పుడు వచ్చినట్లుగా ఉంటుంది. 
 
 క్యాలెండర్ చూసుకున్నప్పుడు మాత్రమే సంవత్సరాలు తరుగుతున్న విషయం గుర్తొస్తోంది. నిన్నే యాక్టింగ్ మొదలుపెట్టినట్లుంది. కాబట్టి, మరో పదేళ్లు ఇలా సక్సెస్‌ఫుల్‌గా నెట్టుకొచ్చేస్తాననే నమ్మకం ఉంది’’ అన్నారు. ప్రస్తుతం తెలుగుతో పాటు తమిళంలో రెండు చిత్రాల్లో నటిస్తున్నారామె. హిందీ చిత్రాల సంగతేంటి? అనే ప్రశ్న త్రిష ముందుంచితే  -‘‘బాలీవుడ్‌పై పెద్దగా దృష్టి సారించడంలేదు. సౌత్‌లో హ్యాపీగా ఉంది. ఇక, పనిగట్టుకుని హిందీ సినిమాల కోసం ఎదురు చూడడం ఎందుకు?’’ అన్నారామె.
 

Advertisement
 
Advertisement
Advertisement