breaking news
Endrendrum Punnagai
-
మరో పదేళ్లు ఇలాగే...
‘‘ప్రియా.. నువ్వు సూపర్. నిన్ను మర్చిపోవడం అంత సులువు కాదు. వీలుంటే నీ ప్రేమికుడవ్వాలని ఉంది’’ అంటూ కొంతమంది అబ్బాయిలు ఇటీవల త్రిషకు ట్విట్టర్ ద్వారా ప్రేమ సందేశాలు పంపారు. ఇంతకీ ప్రియా ఎవరు? ఆమె గురించి త్రిషకు సందేశాలు పంపడమేంటి అనుకుంటున్నారా? తమిళ చిత్రం ‘ఎండ్రెండ్రుమ్ పున్నగై’లో త్రిష చేసిన పాత్ర పేరిది. ఈ చిత్రం ఘనవిజయం సాధించడంతో పాటు త్రిషకు చాలా మంచి పేరు తెచ్చిపెట్టింది. గత ఏడాది చివర్లో విడుదలైన ఈ సినిమా విజయపథంలో దూసుకెళుతూ త్రిషకు ఈ ఏడాది శుభారంభాన్నిచ్చింది. పదేళ్ల క్రితం సినిమాల్లోకొచ్చినప్పుడు ఎలా ఉందో ఇప్పుడూ త్రిష అలానే ఉందని కూడా చాలామంది అంటున్నారు. ఈ సినిమాలో అంత యంగ్‌గా కనిపించడంతో పాటు అద్భుతంగా నటించారామె. అసలు త్రిష వయసు పెరుగుతోందా? తరుగుతోందా? అని కూడా అనుకుంటున్నారు. ఇదే విషయాన్ని త్రిష ముందుంచితే -‘‘నా సంతోషానికి కారణం ఇలాంటి అభినందనలే. సంతోషమే సగం బలం అంటారు. ఆ బలం వల్లే నా వయసు పెరుగుతున్నా తగ్గుతున్నట్లుగా ఉందేమో. అయినా నేను సినిమాల్లోకొచ్చి పదేళ్లయ్యిందంటే నమ్మబుద్ధి కావడంలేదు. ఇప్పుడు వచ్చినట్లుగా ఉంటుంది. క్యాలెండర్ చూసుకున్నప్పుడు మాత్రమే సంవత్సరాలు తరుగుతున్న విషయం గుర్తొస్తోంది. నిన్నే యాక్టింగ్ మొదలుపెట్టినట్లుంది. కాబట్టి, మరో పదేళ్లు ఇలా సక్సెస్‌ఫుల్‌గా నెట్టుకొచ్చేస్తాననే నమ్మకం ఉంది’’ అన్నారు. ప్రస్తుతం తెలుగుతో పాటు తమిళంలో రెండు చిత్రాల్లో నటిస్తున్నారామె. హిందీ చిత్రాల సంగతేంటి? అనే ప్రశ్న త్రిష ముందుంచితే -‘‘బాలీవుడ్‌పై పెద్దగా దృష్టి సారించడంలేదు. సౌత్‌లో హ్యాపీగా ఉంది. ఇక, పనిగట్టుకుని హిందీ సినిమాల కోసం ఎదురు చూడడం ఎందుకు?’’ అన్నారామె. -
ఆ నచ్చినవాడెవరు?
నచ్చినోడితో జీవితం పంచుకోవడం సంతోషమే కదా అంటోంది నటి త్రిష. ఈ బ్యూటీకి పెళ్లి కళ వచ్చేసిందనేది తాజా వార్త. పెళ్లెప్పుడంటూ ఎన్నోసార్లు ఎందరో అడిగిన ప్రశ్నకు ఈ చెన్నై చిన్నది బదులిచ్చింది. త్వరలోనే పెళ్లి చేసుకుంటానంటున్న త్రిష ప్రస్తుతం చాలా జోష్‌లో ఉంది. అందుకు కారణం తాజాగా ఈ భామ నటించిన ఎండ్రెండ్రుం పున్నగై చిత్రం హిట్‌టాక్‌ను సొంతం చేసుకోవడమే. త్రిష మాట్లాడుతూ తాను సినీ రంగ ప్రవేశం చేసి దశాబ్దం దాటిందని చెప్పింది. చిత్ర విజయం అనేది ఏ నటికైనా చాలా ముఖ్యం అని చెప్పింది. ఎండ్రెండ్రుం పున్నగై తనకు చాలా ముఖ్యమైన చిత్రం అని చెప్పింది. ఏడాది గ్యాప్ తరువాత తమిళంలో విడుదలైన ఈ చిత్రం సక్సెస్ టాక్‌ను సంపాదించుకోవడం ఆనందంగా ఉందని పేర్కొంది. హీరోయిన్గా అన్ని తరహా పాత్రలు పోషించానని అందువలన ఫలానా పాత్ర పోషించాలనే కోరికలు లేవని పేర్కొంది. తన మనసుకు నచ్చిన పాత్రల్ని చేసుకుంటూ పోతున్నట్టు తెలిపింది. పెళ్లి చేసుకుంటున్నారా? అని తనను అడుగుతున్నారని ఖచ్చితంగా అది జరుగుతుందని చెప్పింది. త్వరలోనే పెళ్లి చేసుకుని సెటిల్ అవ్వనున్నట్లు తెలిపింది. జీవితంలో మనసుకు నచ్చిన వాడితో భాగం పంచుకోవడం ఆనందమేగా నంటున్న ఈ ముద్దుగుమ్మ ఆ నచ్చిన వాడెవరో చెప్పలేదు.