జయ్‌తో జోడీకి సై | trisha romance with Jay | Sakshi
Sakshi News home page

జయ్‌తో జోడీకి సై

Jul 18 2014 1:01 AM | Updated on Sep 2 2017 10:26 AM

జయ్‌తో జోడీకి సై

జయ్‌తో జోడీకి సై

యువ నటుడు జయ్‌తో స్టార్ హీరోయిన్లు జతకట్టడానికి సై అంటున్నారు. ఆ మధ్య రాజారాణి చిత్రంలో నయనతార జయ్‌తో రొమాన్స్ చేశారు.

యువ నటుడు జయ్‌తో స్టార్ హీరోయిన్లు జతకట్టడానికి సై అంటున్నారు. ఆ మధ్య రాజారాణి చిత్రంలో నయనతార జయ్‌తో రొమాన్స్ చేశారు. తాజాగా త్రిష రెడీ అవుతున్నట్లు సమాచారం. వడకర్రి హిట్‌తో మంచి జోరులో ఉన్న జయ్ నటించిన తిరుమణం ఎన్నుం నిఖా ఈ నెల 24న తెరపైకి రానుంది. ఇందులో నజ్రియా హీరోయిన్. జయ్ తాజా చిత్రానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఇంతకు ముందు వాయయైమూడి పేసవుం, వడకర్రి చిత్రాల నిర్మాణంలో భాగస్వామ్యం పంచుకున్న వరుణ్ మణియన్ రాడియన్స్ మీడియా సంస్థ, సుశాంత్ ప్రసాద్, గోవిందరాజ్ ఫిలిం డిపార్ట్‌మెంట్ సంస్థతో కలిసి నిర్మించనున్న చిత్రంలో జయ్ హీరోగా నటించనున్నారు.
 
 ఉదయం ఎన్‌హెచ్ 4 కంటే సక్సెస్‌ఫుల్ చిత్రం ద్వారా పరిచయమైన మణిమారన్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఇంకా పేరు నిర్ణయించని ఈ చిత్రంలో నటి త్రిష హీరోయిన్‌గా నటించే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఈ విషయమై చిత్ర దర్శక నిర్మాతలు ఈ బ్యూటీతో చర్చలు జరుపుతున్నట్లు తెలిసింది. అన్ని వర్గాలను అలరించేలా ఈ చిత్రం ఉంటుందని నిర్మాతలంటున్నారు. వేల్‌రాజ్ ఛాయాగ్రహణం అందించనున్నారు.
 

Advertisement
 
Advertisement
Advertisement