ఎందుకంటే లైఫ్‌లో బిగ్‌ ఛేంజ్‌ కోసం.. : నటి | Trisha New hair cut creates Buzz in Social Media | Sakshi
Sakshi News home page

Sep 12 2018 6:07 PM | Updated on Oct 22 2018 6:13 PM

Trisha New hair cut creates Buzz in Social Media - Sakshi

పెళ్లి చేసుకోబోతున్నానంటూ త్రిష హింట్‌ ఇచ్చిందా!?

సాక్షి, తమిళసినిమా: గత 12 ఏళ్లుగా త్రిష నట జీవితాన్ని చూస్తూనే ఉన్నాం. ఆది నుంచి ఇప్పటి వరకూ సంచలనాల పంథాను ఆమె కొనసాగిస్తున్నారు. ఈ అమ్మడు ప్రేమలో పడిందని చాలాసార్లు సామాజిక మాధ్యమాల్లో కథనాలు వచ్చాయి. 2014లో నిర్మాత, వ్యాపారవేత్త వరుణ్‌ మణియన్‌తో ప్రేమపెళ్లికి సిద్ధమైందంటూ కథనాలు వచ్చాయి. పెళ్లికి ముందే ప్రేమికుల చిహ్నమైన తాజ్‌మహల్‌ను ప్రియుడితో కలిసి ఆమె చుట్టివచ్చారు. దీంతో పెళ్లి పీటలెక్కడమే తరువాయి అనుకున్నారు. కానీ అనూహ్యంగా వీరు బ్రేకప్‌ చేసుకున్నారు.

ఆ తర్వాత మళ్లీ ఇప్పుడు త్రిష పెళ్లి గురించి కథనాలు చక్కర్లు కొడుతున్నాయి. ఇందుకు కారణం లేకపోలేదు. హీరోయిన్‌ ఒరియేంటెడ్‌ సినిమాలు చేసే స్థాయికి త్రిష ఎదిగారు. అయితే, సక్సెస్‌ మాత్రం దోబూచులాడుతోంది. ధనుష్‌తో జతకట్టిన ‘కొడి’ చిత్రం తరువాత ఈ అమ్మడు హిట్‌ చూసిన పాపాన పోలేదు. అయినా ఈ బ్యూటీని లక్కు వెతుక్కుంటూ వచ్చింది. ఎంతోకాలంగా రజనీకాంత్‌తో కలిసి ఒక్క సన్నివేశంలోనైనా నటించాలని భావిస్తున్న త్రిషకు.. ఇప్పుడు ఆయన సరసన కథానాయకిగా నటించే అవకాశం దక్కింది.

‘ పేట’ చిత్రంలో సూపర్‌స్టార్‌తో త్రిష రొమాన్స్‌ చేయబోతోంది. ఈ నేపథ్యంలో త్రిష ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేసిన ఫొటో పెద్ద చర్చకు దారితీసింది.
అందులో తన జుత్తును షార్ట్‌గా కట్‌ చేసుకుని త్రిష చాలా స్టైలిష్‌గా కనిపించింది. రజనీ చిత్రం కోసమే ఈ గెటఫ్‌ అని అంతా అనుకున్నారు. కానీ, త్రిష మాత్రం అభిమానులు అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇస్తూ.. ఒక అమ్మాయి తన జుత్తును కత్తిరించుకుందంటే ఆమె జీవితంలో పెద్ద మార్పును రాబోతున్నదని అంటూ ట్విస్ట్‌ ఇచ్చారు. ఇంతకు ఆ పెద్ద మార్పు ఏమిటబ్బా అంటూ అభిమానులు ఆలోచనలో పడ్డారు. త్రిష చిరకాల కోరిక అయిన రజనీకాంత్‌తో జత కట్టడం సారమైంది.
ఇక, మిగిలింది పెళ్లే.. ఈ అమ్మడు పెళ్లికి రెడీ అవుతోందా? అన్న సందేహం మొదలైంది. ఈ క్రమంలో త్రిషకు పెళ్లి అంటూ మళ్లీ సోషల్‌ మీడియాలో ప్రచారం ఊపందుకుంది.

త్రిష రియాక్ట్‌ అవ్వలేదు కానీ, ఆమె తల్లి ఉమా కృష్టన్‌ వెంటనే స్పందించారు. పెళ్లి ప్రచారం ఉట్టి వదంతులేనని, వాటిని నమ్మవద్దనీ, జస్ట్‌ ఫ్యాషన్‌ కోసమే ఆమె వెంట్రుకలు కట్‌ చేసుకున్నారని వివరణ ఇచ్చారు. త్రిష న్యూ స్టైల్‌ వెనుక ప్రత్యేకత ఏమీ లేదని తెలిపారు. కాగా ప్రస్తుతం త్రిష విజయసేతుపతితో రొమాన్స్‌ చేసిని ‘96’  విడుదల కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement