గురి తప్పింది | Tom Cruise’s ‘Top Gun’ is still flying high – with the best of the best spoofs | Sakshi
Sakshi News home page

గురి తప్పింది

Sep 3 2018 6:36 AM | Updated on Sep 3 2018 6:36 AM

Tom Cruise’s ‘Top Gun’ is still flying high – with the best of the best spoofs - Sakshi

సెకండ్‌ టాప్‌గన్‌ బాక్సాఫీస్‌ గురి తప్పి ఏడాది వెనక్కి వెళ్లింది. హాలీవుడ్‌ యాక్షన్‌ హీరో టామ్‌ క్రూజ్‌ కథానాయకుడిగా జోసెఫ్‌ కోకిన్క్సీ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘టాప్‌ గన్‌: మేవరిక్‌’. దాదాపు 30ఏళ్ల క్రితం టామ్‌ క్రూజ్‌ హీరోగానే వచ్చిన ‘టాప్‌ గన్‌’ సినిమాకు ఇది సీక్వెల్‌. ఈ సినిమా షూటింగ్‌ ఈ ఏడాది మేలో ప్రారంభమైంది. ముందు ఈ సినిమాను వచ్చే ఏడాది జూలైలో విడుదల చేయాలనుకున్నారు. కానీ ఇప్పుడు 2020 జూన్‌లో రిలీజ్‌ చేయనున్నట్లు చిత్రబృందం అధికారికంగా ప్రకటించిందని హాలీవుడ్‌లో టాక్‌ వినిపిస్తోంది. ఇదిలా ఉంటే ‘టాప్‌ గన్‌’ వచ్చి 30 ఏళ్లయింది. ఫస్ట్‌ పార్ట్‌ను సెకండ్‌ పార్ట్‌కి కనెక్ట్‌ చేయాలి. లేటెస్ట్‌ టెక్నాలజీ, గ్రాఫిక్స్‌ వర్క్‌ను దృష్టిలో పెట్టుకునే ఈ సినిమాను వాయిదా వేశారని వినికిడి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement