స్క్రీన్‌ టెస్ట్‌

tollywood movies special screen test 18 jan 2019 - Sakshi

రైతులకు సంక్రాంతి ఎంత పెద్ద పండగో, సినిమా పరిశ్రమకు కూడా అంతే పెద్ద పండగ. తెలుగు రాష్ట్రాల్లోని ప్రజలందరూ సంక్రాంతి మూడ్‌లోనే ఉన్నారు. అందుకే సంక్రాంతి సినిమాల గురించి, సినిమా వాళ్ల
సంక్రాంతి గురించి ఈ వారం క్విజ్‌...

1. 2012, 2013, 2014 వరుసగా సంక్రాంతికి తన సినిమాలను విడుదల చేసిన టాప్‌ హీరో ఎవరో కనుక్కోండి?
ఎ) ప్రభాస్‌  బి) మహేశ్‌బాబు సి) చిరంజీవి డి) అల్లు అర్జున్‌

2. తెలుగు నిర్మాతల్లో ఏ నిర్మాతను ‘సంక్రాంతి రాజు’ అన్నారో తెలుసా?
ఎ) జీవీజీ రాజు     బి) ‘దిల్‌’ రాజు   సి) అర్జున్‌ రాజు   డి) యం.యస్‌. రాజు

3. ఈ సంక్రాంతికి (2019) విడుదలైన సినిమాల్లో ఏ బాలీవుడ్‌ హీరోయిన్‌ తెలుగు తెరకు పరిచయమయ్యారో చెప్పుకోండి?
ఎ) విద్యాబాలన్‌   బి) కియరా అద్వానీ   సి) శ్రద్ధాకపూర్‌   డి) కంగనా రనౌత్‌

4. ‘సోగ్గాడే చిన్ని నాయనా’ అంటూ 2017 సంక్రాంతికి వచ్చారు నాగార్జున. ఆ చిత్రంలో బంగార్రాజు సరసన నటించిన నటి గుర్తున్నారా?
ఎ) లావణ్యా త్రిపాఠి     బి) రమ్యకృష్ణ     సి) అనసూయ             డి) అనుష్క

5. తెలుగు వారి పెద్ద పండగ ‘సంక్రాంతి’. ఆ పేరుతో విడుదలైన సినిమాలో తెలుగులో పేరున్న నలుగురు హీరోలు నటించారు. వెంకటేశ్, శ్రీకాం త్, శివబాలాజీలతో పాటు మరో తమ్ముడుగా నటించిన ఆ నటుడెవరో చెప్పండి? (ఇప్పుడు ఆ నటుడు తెలుగు సినిమాల్లో ఓ ప్రముఖ హీరో)
ఎ) శర్వానంద్‌ బి) తరుణ్‌ సి) రోహిత్‌ డి) ఆకాశ్‌

6. ‘సంక్రాంతి వచ్చిందే తుమ్మెద... సరదాలు తెచ్చిందే తుమ్మెద...’ అనే పాట ‘సోగ్గాడి పెళ్లాం’ చిత్రంలోనిది. ఈ పాటలో నటించిన హీరో ఎవరో గుర్తు తెచ్చుకోండి?
ఎ) మోహన్‌బాబు     బి) హరనాథ్‌   సి) చంద్రమోహన్‌     డి) శ్రీధర్‌

7. మహేశ్‌బాబు, వెంకటేశ్‌ ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ సంక్రాంతికి విడుదలై విజయం సాధించింది. ఆ చిత్రదర్శకుడెవరో కనుక్కోండి?
ఎ) శ్రీకాంత్‌ అడ్డాల     బి) సుకుమార్‌     సి) కృష్ణవంశీ              డి) త్రివిక్రమ్‌

8. ‘శతమానం భవతి ’ చిత్రంలోని సంక్రాంతి పాటలో శర్వానంద్, అనుపమా పరమేశ్వరన్‌ సందడి చేశారు. ‘‘గొబ్బిళ్లో గొబ్బిళ్లు....’ అంటూ సాగే ఆ పాట రచయితెవరో కనుక్కోండి?
ఎ) అనంత శ్రీరామ్‌          బి) సిరివెన్నెల     సి) రామజోగయ్య శాస్త్రి     డి) శ్రీమణి

9. ఎన్టీ రామారావును ‘మనదేశం’ చిత్రం ద్వారా తెలుగు చిత్రసీమకు పరిచయం చేశారు ఎల్వీ ప్రసాద్‌. వారిద్దరి కాంబినేషన్‌లో అనేక సినిమాలు వచ్చినప్పటికీ 1955లో వచ్చిన ఓ సినిమా సంక్రాంతికి విడుదలై సంచలనం సృష్టించింది. ఆ చిత్రం పేరేంటి?
ఎ) మనదేశం     బి) షావుకారు    సి) సంసారం     డి) మిస్సమ్మ

10. 2017 సంక్రాంతికి బాలకృష్ణ హీరోగా నటించిన చిత్రం ‘గౌతమి పుత్ర శాతకర్ణి’ రిలీజైంది. అది ఆయన నటించిన 100వ చిత్రం. క్రిష్‌ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో గౌతమిగా నటించిన ప్రముఖ బాలీవుడ్‌ నటి ఎవరో తెలుసా?
ఎ) రవీనా టాండన్‌      బి) టబు    సి) హేమమాలిని          డి) సుస్మితా సేన్‌

11. ‘శంకర్‌ దాదా జిందాబాద్‌’ తర్వాత చిరంజీవి హీరోగా చేసిన చిత్రం ‘ఖైదీ నంబర్‌ 150’. ఎన్ని సంవత్సరాల గ్యాప్‌ తర్వాత చిరు ఈ సినిమా  చేశారో తెలుసా ? (ఈ సినిమా సంక్రాంతికి విడుదలైంది)
ఎ) 7 ఏళ్లు      బి) 8 ఏళ్లు   సి) 10 ఏళ్లు   డి) 6 ఏళ్లు

12. 2010 సంక్రాంతికి విడుదలై సంచలన విజయం సాధించిన జూనియర్‌ యన్టీఆర్‌ సినిమా పేరేంటో తెలుసా? ( చిన్న క్లూ: ఆ చిత్రంలో ఎన్టీఆర్‌ ద్విపాత్రాభినయం చేశారు)
ఎ) అదుర్స్‌     బి) ఆం్ర«ధావాలా     సి) యమదొంగ    డి) నరసింహుడు

13. ఈ ప్రముఖ దర్శకుని సినిమా ఒక్కసారి కూడా సంక్రాంతి బరిలోకి రాలేదు. ఎవరా దర్శకుడు. కొంచెం మెదడుకి పదును పెట్టండి?
ఎ) పూరి జగన్నాథ్‌   బి) వీవీ వినాయక్‌    సి) ఎస్‌.ఎస్‌. రాజమౌళి    డి) సుకుమార్‌

14. ప్రభాస్‌ కెరీర్‌లో ఇప్పటివరకు రెండు చిత్రాలు మాత్రమే సంక్రాంతి పందెంలో నిలిచాయి. అందులో ఒకటి వీవీ వినాయక్‌ దర్శకత్వం వహించిన ‘యోగి’. మరో చిత్రం ఏంటో కనుక్కుందామా?
ఎ) వర్షం     బి) పౌర్ణమి    సి) బిల్లా      డి) మున్నా

15. ‘సంక్రాంతి’, ‘గోరింటాకు’, ‘దీపావళి’ మూడు పండగల పేర్లతో ఉన్న సినిమాలలో హీరోయిన్‌గా నటించిన నటి ఎవరో కనుక్కుందామా?
ఎ) స్నేహా    బి) ఆర్తి అగర్వాల్‌    సి) సౌందర్య డి) కల్యాణి

16. ‘ఊరంతా సంక్రాంతి’ చిత్రంలో ఇద్దరు పాపులర్‌ హీరోలు నటించారు. అందులో ఒకరు ఏయన్నార్‌. మరో హీరో ఎవరు?
ఎ) కృష్ణ      బి) శోభన్‌బాబు  సి) కృష్ణంరాజు డి) నాగార్జున

17. కమల్‌హాసన్‌ నటించిన ‘మహానది’ చిత్రంలో ‘సంక్రాంతి..సంక్రాంతి...’ అనే హిట్‌ పాట ఉంది. ఈ సినిమా సంగీత దర్శకుడెవరో తెలుసా?
ఎ) ఇళయరాజా       బి) దేవా   సి) ఎస్‌.ఎ. రాజ్‌కుమార్‌    డి) కేవీ మహదేవన్‌

18. తన మొదటి చిత్రంతోనే సంక్రాంతి బరిలో నిలిచిన దర్శకుడెవరో తెలుసా? ఆయన దర్శకత్వం వహించిన మూడు  చిత్రాలు ఇప్పటివరకు సంక్రాంతి పోటీలో నిలిచాయి. ఇంతకీ ఎవరా దర్శకుడు?
ఎ) శ్రీను వైట్ల      బి) బోయపాటి శ్రీను     సి) క్రిష్‌               డి) శేఖర్‌ కమ్ముల

19. 2019 సంక్రాంతికి ఒకే ఒక డబ్బింగ్‌ సినిమా విడుదలైంది. ఆ చిత్రం ‘పేట’. రజనీకాంత్‌ హీరోగా నటించిన ఈ చిత్రంలో ఆయన సరసన నటించిన ఇద్దరు హీరోయిన్లలో ఒకరు త్రిష. మరో హీరోయిన్‌?
ఎ) నయనతార   బి) రాధికా ఆప్టే సి) సిమ్రాన్‌ డి) మీనా

20. సంక్రాంతి అనగానే తెలుగు సినీ పరిశ్రమలో పెద్ద సినిమాలు రిలీజవుతాయి. 2017 సంక్రాంతికి చిరంజీవి నటించిన 150వ చిత్రం ‘ఖైదీ నంబర్‌ 150’, బాలకృష్ణ 100వ చిత్రం ‘గౌతమి పుత్ర శాతకర్ణి’ వచ్చాయి. ఈ రెండు చిత్రాలకు మాటల ర^è యిత ఒక్కరే. ఆయనెవరు?
ఎ) వక్కంతం వంశీ         బి) అబ్బూరి రవి    సి) బుర్రా సాయిమాధవ్‌   డి) యం.రత్నం

మీరు 6 సమాధానాల కంటే తక్కువ చెబితే... మీకు సినిమా అంటే ఇష్టం     
10 సమాధానాల వరకూ చెప్పగలిగితే...   మీకు సినిమా అంటే ఇంట్రెస్ట్‌
15 సమాధానాల వరకూ చెప్పగలిగితే... మీకు సినిమా అంటే పిచ్చి
20 సమాధానాలూ చెప్పగలిగితే...  ఇంకోసారి ఈ క్విజ్‌ చదవకండి!

సమాధానాలు
1) (బి) 2) (డి) 3) (ఎ) 4) (బి) 5) (ఎ) 6) (ఎ) 7) (ఎ) 8) (డి) 9) (డి) 10) (సి) 11) (సి)
12) (ఎ)13) (సి) 14) (ఎ) 15) (బి) 16) (ఎ) 17) (ఎ) 18) (సి) 19) (సి) 20) (సి)

నిర్వహణ: శివ మల్లాల

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top