 
													ఎలక్షన్‌లు వచ్చేస్తున్నాయి. ఏ నోట విన్నా రాజకీయమే. రచ్చబండ మీద, పొలం గట్ల దగ్గర అక్కడా ఇక్కడా అనే తేడా లేదు. ఎక్కడ చూసినా రాజకీయాలే. రాజకీయాలు వేరు, సినిమాలు వేరు. సినిమా సీన్లలో ఉండే రాజకీయాలను కథ నిర్ణయిస్తుంది. ఒకప్పుడు సినిమా, రాజకీయాలు రెండూ రెండు భిన్న కోణాలు. ప్రస్తుతం రాజకీయాలు, సినిమాలు కలిసే ప్రయాణం చేస్తున్నాయి అంటే అతిశయోక్తి కాదేమో. సినిమాల్లో రాజకీయాలు కాదు, రాజకీయాల్లో సినిమా స్టార్స్ గురించి ఈ వారం స్పెషల్ క్విజ్.
1. సినిమా వాళ్లల్లో మెంబర్ ఆఫ్ పార్లమెంట్‌కు (యం.పి) ఎన్నికైన మొట్టమొదటి తెలుగు నటుడు ఇతను. కాంగ్రెస్ పార్టీ తరపున ఒంగోలు నుంచి గెలుపొందిన ఈ నటుడు ఎవరో తెలుసా?
ఎ) చిత్తూరు నాగయ్య బి) కాంతారావు   సి) కొంగర జగ్గయ్య   డి) యస్వీ రంగారావు
2. 1989లో పార్లమెంట్ సభ్యుడిగా ఎన్నికైన నటుడెవరో కనుక్కుందామా?
ఎ) కృష్ణ   బి) శోభన్‌బాబు   సి) హరనాథ్   డి) శరత్‌బాబు
3. ప్రముఖ నటుడు చిరంజీవి 2008లో  ‘ప్రజారాజ్యం’ పార్టీని స్థాపించారు. ఆ పార్టీకి ఎన్నికల కమిషన్ కేటాయించిన గుర్తు ఏంటో కనుక్కోండి?
ఎ) రైలు         బి) కారు    సి) విమానం    డి) స్కూటర్
4. 2009 ఎలక్షన్స్‌లో వైయస్ రాజశేఖర్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ పార్టీ తరపున యం.ఎల్.ఏ గా గెలిచిన సినీ నటి ఎవరో తెలుసా? ( సికింద్రాబాద్ నియోజకవర్గం)
ఎ) కుష్బూ   బి) నగ్మా    సి) సుహాసిని    డి) జయసుధ
5. నటి రోజా వైయస్‌ఆర్ సీపీ తరపున పోటీ చేసి యం.ఎల్.ఏగా గెలుపొందారు. ఆమె ఏ నియోజకవర్గం నుంచి పోటీ చేసి గెలుపొందారో తెలుసా?
ఎ) నగరి     బి) చిత్తూరు   సి) పీలేరు    డి) తిరుపతి
6. ఉత్తరప్రదేశ్ లోని రాంపూర్ నియోజకవర్గం నుంచి పార్లమెంటేరియన్‌గా గెలుపొందిన నటి?
ఎ) హేమమాలిని    బి) జయప్రద   సి) జయబాధురి   డి) రేఖ
7. ఈయన ప్రముఖ సినిమా రచయిత. తమిళనాట రాజకీయాల్లో చాలా కీలక పాత్రను పోషించారు. ఎవరా రచయిత?
ఎ) కరుణానిధి   బి) యం.జీ.ఆర్   సి) స్టాలిన్    డి) నెపోలియన్
8. నటి రాధిక భర్త శరత్‌కుమార్. అనేక తెలుగు సినిమాల్లో కూడా నటించారు. తమిళ రాజకీయల్లో క్రియాశీలక వ్యక్తి. 2007లో ఆయన తన సొంత పొలిటికల్ పార్టీని స్థాపించారు. ఆ పార్టీ పేరేంటి?
ఎ) హిందూ మక్కళ్  కట్చి    బి) కొంగునాడు మున్నేట్ర కళగం   సి) తమిళ్ మానిల కాంగ్రెస్   డి) ఆల్ ఇండియా సమత్తువ మక్కళ్ కట్చి
9. 1999లో విజయవాడ తూర్పు నియోజకవర్గ యం.ఎల్.ఏగా గెలుపొందిన తెలుగు సినీ ప్రముఖుడెవరో కనుక్కోండి?
ఎ) మురళీమోహన్   బి) ఏవీయస్   సి) అలీ   డి) కోట శ్రీనివాసరావు
10. 1995వ సంవత్సరం నుంచి  6 సంవత్సరాలు రాజ్యసభలో పార్లమెంట్ సభ్యుడిగా కొనసాగిన తెలుగు నటుడెవరు?
ఎ) చిరంజీవి   బి) మోహన్‌బాబు   సి) బాలకృష్ణ    డి) ఏయన్నార్
11. 2019 కర్ణాటక ఎన్నికల్లో ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తాను అని ఈ మధ్యే ప్రకటించిన నటుడెవరో కనుక్కోండి?
ఎ) సాయికుమార్   బి) ప్రకాశ్ రాజ్    సి) అయ్యప్ప.పి.శర్మ    డి) యశ్
12. 1998లో భారతీయ జనతా పార్టీలో చేరి,  మెదక్ నియోజక వర్గం నుంచి యం.పీ గా పోటీ చేసి గెలుపొందారు. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. ఎవరా నటి?
ఎ) శారద   బి) కవిత   సి) విజయశాంతి   డి) విజయనిర్మల
13.  ప్రముఖ నటి సౌందర్య ప్రచారానికి వెళ్తూ ప్రమాదవశాత్తు హెలికాప్టర్ కుప్పకూలి మరణించారు. ఆమె ఏ సంవత్సరంలో మరణించారు?
ఎ) 2000       బి) 2001    సి) 2002     డి) 2004
14. ఈ నటుడు 2017లో కర్ణాటకలోని ఓ పార్టీలో చేరారు. ఐదు నెలల తర్వాత ఆ పార్టీకి తిలోదకాలిచ్చి ప్రజాకీయ అనే సొంత పార్టీని ప్రారంభించారు. ఎవరా  నటుడు?
ఎ)ఉపేంద్ర   బి) పునీత్ రాజ్‌కుమార్   సి) సుదీప్   డి) శివ రాజ్‌కుమార్
15. 2006లో కాంగ్రెస్ పార్టీ తరపున రాజ్యసభ సభ్యుడిగా నియమితులైన దర్శకుడెవరో కనుక్కోండి?
ఎ) దాసరి నారాయణరావు   బి) కె.రాఘవేంద్ర రావు   సి) దిలీప్ కుమార్    డి) రాజేష్‌ఖన్నా
16. ‘మక్కళ్ నీది మయం’ అనే పొలిటికల్ పార్టీని స్థాపించిన తమిళ నటుడు ఎవరు?
ఎ) కమల్‌హాసన్    బి) రజనీకాంత్      సి) విశాల్ డి) విజయ్‌కాంత్
17. ఈయన ప్రముఖ నటుడు. యం.ఎల్.ఏ గా రెండుసార్లు గెలుపొందారు. రెండుసార్లు ఓడిపోయారు. ఆ నటుడెవరు?
ఎ) సుమన్    బి) పోసాని కృష్ణమురళీ    సి) బాబుమోహన్   డి) విజయ్ చందర్
18. 1999లో  పదమూడవ లోక్‌సభకు జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో బాపట్ల నుంచి యంపీగా పోటీ చేసి గెలుపొందిన తెలుగు నిర్మాత ఎవరు?
ఎ) సి.అశ్వనీదత్   బి) మాగంటి బాబు    సి) జి.ఆదిశేషగిరిరావు    డి) డి.రామానాయుడు
19. కాకినాడ నుంచి పోటీచేసి 12వ లోక్‌సభలో అడుగుపెట్టిన ప్రముఖ నటుడు ఎవరు?
ఎ) కృష్ణ    బి) మురళీమోహన్  సి) కైకాల సత్యనారాయణ   డి) కృష్ణంరాజు
20. తమిళనాడు ముఖ్యమంత్రిగా జయలలిత తమిళ ప్రజల గుండెల్లో నిలిచారు. ఆమె మరణానంతరం ఆమెపై 3 బయోపిక్‌లు నిర్మితమవుతున్నాయి. అందులో ఓ చిత్రంలో జయలలిత పాత్రలో నటిస్తున్న నటి ఎవరో తెలుసా?
ఎ) నిత్యామీనన్    బి) అనుష్క   సి) హన్సిక   డి) త్రిష
మీరు 6 సమాధానాల కంటే తక్కువ చెబితే... మీకు సినిమా అంటే ఇష్టం     
10 సమాధానాల వరకూ చెప్పగలిగితే...   మీకు సినిమా అంటే ఇంట్రెస్ట్
15 సమాధానాల వరకూ చెప్పగలిగితే... మీకు సినిమా అంటే పిచ్చి
20 సమాధానాలూ చెప్పగలిగితే...  ఇంకోసారి ఈ క్విజ్ చదవకండి!
సమాధానాలు
1) (సి) 2) (ఎ) 3) (ఎ) 4) (డి) 5) (ఎ) 6) (బి) 7) (ఎ) 8) (డి) 9) (డి) 10) (బి)  11) (బి)
12) (సి) 13) (డి) 14) (ఎ) 15) (ఎ) 16) (ఎ) 17) (సి) 18) (డి) 19) (డి) 20) (ఎ)
నిర్వహణ: శివ మల్లాల

 
  
                                                     
                                                     
                                                     
                                                     
                                                     
                         
                         
                         
                         
                        
