స్క్రీన్‌ టెస్ట్‌

tollywood movies special screen test 08-02-2019 - Sakshi

ఐటెమ్‌ సాంగ్స్‌ స్పెషల్‌

1960–70లలో ఓ ఐటెమ్‌ సాంగ్‌ ఉంది అంటే ఆ పాటల కోసం స్పెషల్‌ ఆర్టిస్ట్‌లు ఉండేవారు. 90లలో సీన్‌ మారింది. స్పెషల్‌ ఆర్టిస్టులతో దాదాపు పని లేకుండా పోయింది. అందుకే అప్పట్లో జయమాలిని, జ్యోతిలక్ష్మి, అనురాధ, హలం, సిల్క్‌ స్మితల్లా ఇప్పుడు బోలెడంత మంది ఐటమ్‌ డ్యాన్సర్స్‌ లేరు. స్పెషల్‌ సాంగ్స్‌ను హీరోయిన్లు కూడా చేస్తున్నారు. సినిమా మార్కెటింగ్‌కు ఇదో  కొత్తరూట్‌ అన్నమాట. ఏది ఏమైనా  ‘ఐటమ్‌ సాంగ్‌’ అంటే కిక్కే వేరు. ఇలాంటి మస్త్‌ మసాలా పాటలకు కాలు కదిపిన తారల గురించి ఈ వారం క్విజ్‌. సరదాగా ఓ లుక్కేయండి.

1 ‘ఓ  సుబ్బారావో ఓ అప్పారావో ఓ వెంకట్రావో ఎవరో ఎవరో ఎవరో ఎవరో వస్తారనుకుంటే నువ్వొచ్చావా...’ అనే పాట యన్టీఆర్, శ్రీదేవి, జయచిత్ర నటించిన ‘బొబ్బిలిపులి’ చిత్రంలోనిది.  ఆ పాట రచయిత ఎవరు?
 ఎ) వేటూరి బి) దాసరి నారాయణరావు  సి) సిరివెన్నెల    డి) కొసరాజు

2 ‘ఇప్పటికింకా నా వయను నిండా పదహారే, చీటికి మాటికి చెయ్యేస్తూ చుట్టూ కుర్రాళ్లే’... ఈ ఒకే ఒక్క పాటతో యూత్‌ మొత్తానికి దగ్గరైన నటి ఎవరు?
ఎ) గాబ్రియేలా  బి) ముమైత్‌ఖాన్‌  సి) ఆండ్రియా   డి) ముంతాజ్‌

3 1980–90ల దశకంలో ఐటమ్‌ సాంగ్‌లతో ఓ వెలుగు వెలిగారు ప్రముఖ డ్యాన్సర్‌ అనూరాధ. అమె దాదాపు ఎన్ని సినిమాల్లో నటించారో తెలుసా?
ఎ) 330  బి) 550 సి) 700 పైన డి) 1000 చిత్రాలు పైనే

4 సూపర్‌హిట్‌ సాంగ్‌ ‘లే లే లే లేలేలే నా రాజా..’ ప్రేమనగర్‌’ చిత్రంలోనిది. ఈ పాటను పాడిన సింగర్‌ పేరేంటి?
ఎ) పి. సుశీల బి) ఎస్‌. జానకి  సి) జిక్కీ       డి) ఎల్‌.ఆర్‌. ఈశ్వరి

5. ‘నేను పక్కా లోకల్‌ పక్కా లోకల్, నేను పక్కా లోకలో...’ అంటూ చిందులేసిన ప్రముఖ హీరోయిన్‌ ఎవరు?
ఎ) కాజల్‌ అగర్వాల్‌  బి) అనుష్క సి) నయనతార డి) లావణ్యా త్రిపాఠి

6 1974లో ‘ఆడదాని అదృష్టం’ చిత్రంతో తెలుగు తెరకు పరిచయమయ్యారు జయమాలిని. ఆమెను తెలుగు చిత్రసీమకు పరిచయం చేసిన దర్శకుడెవరు?
ఎ) కె.వి. రెడ్డి బి) విఠలాచార్య  సి) వి. మధుసూదన్‌రావు  డి) పి.సి. రెడ్డి

7 ‘మసక మసక చీకటిలో మల్లెతోట వెనకాల’ పాట చాలా ఫేమస్‌. ఆ పాట ఏ సినిమాలోనిదో తెలుసా?
ఎ) వయ్యారిభామలు వగలమారి భర్తలు బి) స్త్రీజన్మ  సి) దేవుడు చేసిన మనుషులు  డి) విచిత్ర కుటుంబం

8 ‘అ అంటే అమలాపురం ఆ ఆంటే ఆహాపురం...’ సూపర్‌హిట్‌ సాంగ్‌లో నటించిన నటి పేరేంటి?
ఎ) నటాలియా కౌర్‌ బి) అభినయశ్రీ  సి) రచనా మౌర్య డి) స్కార్లెట్‌ విల్సన్‌

9 ‘నా ఇంటిపేరు సిల్క్‌  నా వంటి రంగు మిల్క్‌...’ అంటూ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌తో  చిందేసిన బ్యూటీ పేరేంటో?
ఎ) శ్రియ       బి) రాశీఖన్నా  సి) సమంత   డి) తమన్నా భాటియా

10 ‘మిర్చి మిర్చి మిర్చి మిర్చి మిర్చి లాంటి కుర్రోడే...’ అనే పాటలో ప్రభాస్‌తో కాలు కదిపిన భామ ఎవరో?
ఎ) మధుశర్మ      బి) హంసానందిని  సి) జబీన్‌ ఖాన్‌    డి) అల్ఫోన్సా

11 ‘జిల్‌ జిల్‌ జిల్‌ జిల్‌ జిగేలు రాణి...’ అంటూ ‘రంగస్థలం’ చిత్రంలో హీరో రామ్‌చరణ్‌ స్టెప్పులేసిన భామ పేరేంటి?
ఎ) కియరా అద్వానిæ బి) శ్రుతీహాసన్‌  సి) అమీ జాక్సన్‌      డి) పూజా హెగ్డే

12 దర్శకుడు శేఖర్‌ కమ్ముల మంచి ఫ్యామిలీ ఎమోషన్స్‌తో సినిమాలు చేస్తారని పేరుంది. సందర్భానుసారంగా ఆయన కూడా ఓ సినిమాలో ఐటెమ్‌ సాంగ్‌ను చిత్రీకరించారు. ఆ సాంగ్‌లో నటించింది ప్రముఖ టీవి యాంకర్‌. ఎవరా యాంకర్‌?
( క్లూ: ఆ పాట ఏంటంటే.. ‘రాజశేఖరా నీపై మోజూ తీరలేదురా, రాజసాన ఏలరా రాజా రాజా...’)
ఎ) శిల్పాచక్రవర్తి  బి) ఉదయభాను  సి) అనసూయ    డి) సుమ

13. ‘కొప్పున పూలెట్టుకొని బుగ్గన ఏలెట్టుకొని ఈదంట నేనెల్తుంటే, కెవ్వుకేక....’ అనే పాటలో నటించిన బాలీవుడ్‌ హాట్‌ లేడీ ఎవరో కనుక్కోండి?
ఎ) ఆలియా భట్‌  బి) ఊర్మిళా మటోండ్కర్‌  సి) కత్రినాకైఫ్‌  డి) మలైకా అరోరా

14 ‘డియో డియో డిసక డిసక...’ అంటూ యూత్‌ను ఎట్రాక్ట్‌ చేసిన నటి పేరేంటి?
ఎ) సన్నీ లియోన్‌  బి) రాఖీ సావంత్‌  సి) సెలీనా జైట్లీ  డి) యానా గుప్తా

15 ‘బావలు సయ్యా మరదలు సయ్యా, రింబోల రింబోలా..’ అంటూ కోట శ్రీనివాసరావు, బాబుమోహన్‌లను ఓ ఆట ఆడించిన నటి ఎవరో గుర్తుందా?
ఎ) డిస్కో శాంతి బి) ‘సిల్క్‌’ స్మిత   సి) విజయలలిత డి) కుయిలీ

16 ‘చిలకలూరి చింతామణి నా పేరంటే తెలియనోళ్లు లేరే జానీ...బ్లాక్‌బస్టరు బ్లాక్‌బస్టరే ’అని అంజలి ఏ హీరోతో డ్యాన్స్‌ చేశారు?
ఎ) రామ్‌చరణ్‌    బి) మహేశ్‌బాబు  సి) యన్టీఆర్‌       డి) అల్లు అర్జున్‌

17. ‘వెల్‌కమ్‌ టూ సక్కుబాయ్‌... గరమ్‌ చాయ్‌ తాగేసెయ్‌.. మజాచెయ్‌...’ అని చార్మీ ఏ హీరోతో స్టెప్పులేశారో గుర్తుందా?
ఎ) నాగార్జున బి) బాలకృష్ణ  సి) వెంకటేశ్‌   డి) రానా

18 ‘పుట్టింటోళ్లు తరిమేశారు  కట్టుకున్నోడు వదిలేశాడు...’ అనే సాంగ్‌లో యన్టీఆర్‌తో కలిసి స్టెప్పులేసిన  ప్రముఖ డ్యాన్సర్‌ ఎవరో  కనుక్కోండి?
ఎ) హలం బి) అనురాధ సి) జయమాలిని  డి) జ్యోతిలక్ష్మీ
19 ‘అటు అమలాపురం ఇటు పెద్దాపురం మధ్య గోదావరి...’  అల్లు శిరీష్, రెజీనా జంటగా నటించిన ‘కొత్తజంట’ చిత్రంలోని పాట ఇది. ఈ పాటలో నటించిన హీరోయిన్‌ ఎవరు?
ఎ) కేథరిన్‌    బి) హన్సిక  సి) మధురిమ  డి) ఈషా రెబ్బా

20, ‘బళ్లారి బావ...’ అంటూ ప్రముఖ బాలీవుడ్‌  హీరోయిన్‌ సమీరారెడ్డి హీరోలు వెంకటేశ్, రానాలతో కలిసి చిందేశారు. ఆ చిత్ర దర్శకుడెవరో తెలుసా?
ఎ) వంశీ పైడిపల్లి   బి) క్రిష్‌ సి) సుకుమార్‌       డి) కృష్ణవంశీ

మీరు 6 సమాధానాల కంటే తక్కువ చెబితే... మీకు సినిమా అంటే ఇష్టం   
10 సమాధానాల వరకూ చెప్పగలిగితే... మీకు సినిమా అంటే ఇంట్రెస్ట్‌    
15 సమాధానాల వరకూ చెప్పగలిగితే... మీకు సినిమా అంటే పిచ్చి    
20 సమాధానాలూ చెప్పగలిగితే...  ఇంకోసారి ఈ క్విజ్‌ చదవకండి!

సమాధానాలు
1) బి 2) బి 3) సి 4) డి 5) ఎ 6) బి 7) సి 8) బి 9) డి 10) బి 11) డి
12) బి 13) డి 14) ఎ 15) బి 16) డి 17) ఎ 18) సి 19) సి  20) బి

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top