కూతురితో బన్నీ క్యూట్ వీడియో! | Tollywood Celebrities Daughters Day Special Posts | Sakshi
Sakshi News home page

కూతురితో బన్నీ క్యూట్ వీడియో!

Sep 22 2019 3:00 PM | Updated on Sep 22 2019 3:17 PM

Tollywood Celebrities Daughters Day Special Posts - Sakshi

ఎప్పుడు సినిమాలతో బిజీగా ఉండే అల్లు అర్జున్‌ సోషల్‌ మీడియాలోనూ అంతే యాక్టివ్‌గా ఉంటాడు. ముఖ్యంగా తన పిల్లలకు సంబంధించిన వీడియోలు ఫోటోలను అభిమానుల కోసం షేర్‌ చేస్తుంటాడు. ఈ రోజు ‘డాటర్స్‌ డే’ సందర్భంగా ఓ క్యూట్ వీడియోను తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశాడు బన్నీ. అల వైకుంఠపురములో సినిమా టీజర్‌లో మురళీ శర్మ, అల్లు అర్జున్‌లు చెప్పిన డైలాగ్‌ను బన్నీ కూతురు అర్హాతో కలిసి చెప్పాడు.

తన క్యూట్‌ క్యూట్‌ ఎక్స్‌ప్రెషన్స్‌ అర్హ చెప్పిన డైలాగ్స్‌కు బన్నీ ఫిదా అవుతున్నారు. టాలీవుడ్ సూపర్‌ స్టార్ మహేష్‌ బాబు కూడా డాటర్స్‌ డే సందర్భంగా ఓ ఎమోషనల్ ట్వీట్ చేశాడు. కూతురితో కలిసి తాను దిగిన ఫోటోలను వీడియో రూపంలో పోస్ట్ చేసిన మహేష్, ‘నిన్ను ఎప్పటికీ ప్రేమిస్తూనే ఉంటాను. నువ్వు ఎప్పుడూ ఇలా మెరిసిపోతూ ఉండాలి’  అంటూ ట్వీట్ చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement